బస్సుల ఫిట్‌నెస్‌ బాధ్యత స్కూల్‌ యాజమాన్యాలదే | - | Sakshi
Sakshi News home page

బస్సుల ఫిట్‌నెస్‌ బాధ్యత స్కూల్‌ యాజమాన్యాలదే

May 27 2025 1:11 AM | Updated on May 27 2025 1:11 AM

బస్సుల ఫిట్‌నెస్‌ బాధ్యత స్కూల్‌ యాజమాన్యాలదే

బస్సుల ఫిట్‌నెస్‌ బాధ్యత స్కూల్‌ యాజమాన్యాలదే

ఖలీల్‌వాడి: స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించాలని, బస్సుల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని రాష్ట్ర రోడ్డు రవాణా సంయుక్త కమిషనర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌ పేర్కొన్నారు. నాగారంలోని జిల్లా రోడ్డు రవాణా శాఖ కార్యాలయంలో స్కూల్‌, కాలేజీ బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. యాజమాన్యాలు బస్సులను సరిగా పట్టించుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కొత్తగా వచ్చిన డ్రైవర్లకు రూట్లు తెలియకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. పీపీ–1 నుంచి ఆరో తరగతి వరకు చదివే పిల్లలు స్కూల్‌కు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు తల్లిదండ్రులు లేదా కుటుంబసభ్యులు బస్సుల వద్ద వేచి ఉండి తమ వెంట తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో డీటీసీ పరిమళ, డీటీవో ఉమామహేశ్వర్‌రావు, రోడ్డు రవాణా సభ్యులు రాజరాజనరేందర్‌, ఏంవీఐలు వివేకానందరెడ్డి, కిరణ్‌, రాహుల్‌, సిబ్బంది తదితరులు ఉన్నారు.

రాష్ట్ర రోడ్డు రవాణా సంయుక్త కమిషనర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement