కామారెడ్డి క్రైం: డీఆర్‌డీవో అధికారులు, సిబ్బందిని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం అభినందించారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో 11,668 మహిళా సంఘాలకుగాను రూ.802 కోట్ల విలువైన బ్యాంక్ లింకేజీ రుణాలను అందించడం ద్వారా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఇందుకోసం కృషి చేసిన డీఆర్‌డీవో సిబ్బందిని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం తన చాంబర్‌లో సన్మానించారు. ఈయేడాది సైతం లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో సురేందర్, డీపీఎం సుధాకర్, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: హైదరాబాద్ మధురానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ, యూసుఫ్‌గూడ పాలిటెక్నిక్ కళాశాలల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో అనాథలు, పాక్షిక అనాథలు, పేద బాలికలకు ప్రవేశం కల్పించనున్నారు. ఆసక్తిగలవారు ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా సంక్షేమాధికారి ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. పాలిసెట్ రాయకపోయినా పదో తరగతి పాసైతే చాల ని పేర్కొన్నారు. అనాథలకు కులం, ఆదా య ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని తెలిపారు. దరఖాస్తుల సమర్పణ, ఇతర వివరాలకు కామారెడ్డి ప్రియా డీలక్స్ రోడ్డులోని బాలరక్ష భవన్‌లో సంప్రదించాలని సూచించారు.
జిల్లా సరిహద్దులో పోలీస్ చెక్‌పోస్ట్ ఏర్పాటు
నాగిరెడ్డిపేట: బక్రీద్‌ను పురస్కరించుకొని జిల్లా సరిహద్దులోగల పోచారం వద్ద బుధవారం పోలీసులు ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను ఏర్పా టు చేశారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. జిల్లాలోకి ప్రవేశించే, జిల్లాను దాటి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు. వచ్చేనెల ఏడో తేదీ వరకు చెక్‌పోస్ట్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలో ఉన్న పోలీస్ సిబ్బంది విడతలవారీగా చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తారని తెలిపారు.
ఎలక్ట్రీషియన్‌పై వేటు
భిక్కనూరు: భిక్కనూరు శ్రీసిద్దరామేశ్వరాలయంలో హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఎలక్ట్రీషియన్ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీధర్ బుధవారం తెలిపారు. గత నెల 22న ఆలయంలో హుండీ లెక్కిస్తుండగా సదరు ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. ఈ విషయాన్ని ‘సాక్షి’ గతనె ల 29న వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన దేవాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు ఎలక్ట్రీషియన్‌ను సస్పెండ్ చేయాలని ఈవోను ఆదేశించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆర్‌జేసీ ఆదేశాల మేరకు ఎలక్ట్రీషియన్‌పై చర్యలు తీసుకున్నామన్నారు.
రెండు రోజుల్లో జొన్న కొనుగోళ్ల నిలిపివేత
పెద్దకొడప్‌గల్: మండల కేంద్రంలోని సొసై టీలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్క్‌ఫెడ్ జిల్లా అధికారి మహేష్ కుమార్ బుధవారం పరిశీలించారు. రెండు రోజుల్లో జొన్న కొనుగోళ్లను నిలిపి వేయను న్నట్లు తెలిపారు. ఇంకా రైతుల వద్ద జొన్న లుంటే వెంటనే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ్, సొసైటీ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, కార్యదర్శి సందీప్ పాల్గొన్నారు.
17 నుంచి ఆర్‌ఎస్‌ఎస్ ఉద్యోగి ప్రారంభిక్ వర్గ
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని శ్రీసరస్వతి శిశుమందిర్‌లో ఈనెల 17న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ఉద్యోగి ప్రారంభిక్ వర్గ ప్రారంభంకానుందని ఆ సంస్థ జిల్లా కార్యవాహ సంతోష్‌రెడ్డి తెలిపారు. 17 వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే శిక్షావర్గ 19న ముగుస్తుందని పేర్కొన్నారు. 20 ఏళ్లుపైబడి ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, వృత్తి పనుల్లో స్థిరపడ్డవారు పాల్గొనాలని, ఇతర వివరాలకోసం 94411 54360, 94407 68774, 99489 28740 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

అధికారులకు అభినందన

రెండు రోజుల్లో జొన్న కొనుగోళ్ల నిలిపివేత