
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని చిన్న ఆరేపల్లి గ్రామానికి చెందిన కొంకుల రాకేశ్(20) అనే డిగ్రీ విద్యార్థి సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్న ఆరేపల్లి గ్రామానికి చెందిన కొంకుల పోచవ్వ, గంగారాం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడైన రాకేశ్ ఎల్లారెడ్డి పట్టణంలో రౖపైవెట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఉపాధి కోసం తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వలస వెళ్లారు. తమ్ముడు మధుతో కలిసి చదువుకుంటూ ఇంటి వద్ద ఉంటున్న రాకేశ్ ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్‌కు అలవాటు పడ్డాడు. ఆన్‌లైన్ గేమ్ ఆడటం ద్వారా రూ. 80 వేలు పొగొట్టుకున్నాడు. ఈ విషయం తండ్రికి తెలిసి మందలించాడు. అంతే కాకుండా రాకేశ్ తరచూ ఫోన్ మాట్లాడుతున్నాడని తండ్రి మరోమారు మందలించడంతో తీవ్ర మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శివకుమార్ మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.