
ఇసుక టిప్పర్‌ను పట్టుకున్న అధికారులు
మద్నూర్(జుక్కల్): ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐ సాయిబాబా హెచ్చరించారు. ‘సాక్షి’లో ఇటీవల ప్రచురితమైన ‘ఆగని ఇసుక అక్రమ రవాణా’ అనే కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు డోంగ్లీ ఆర్‌ఐ సాయిబాబా తెలిపారు. దీంతో బుధవారం తెల్లవారుజామున డోంగ్లీ మండలంలోని లింబూర్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకొని మద్నూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.