
నవమాసాలు కడుపున మోసి, కని పెంచిన కనిపించే దైవం అమ్మ.. ఆ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : క్రీడలు, క్రీడాకారులకు నిలయమైన తాడ్వాయి మండల కేంద్రం దేశ సేవలోనూ ముందుంది. ఆ ఊరు నుంచి ఇప్పటివరకు 23 మంది సైన్యంలో చేరగా.. రవీందర్‌రెడ్డి అనే సైనికుడు ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ప్రస్తుతం 22 మంది సైన్యంలో ఉన్నారు. ఆదివారం మాతృ దినోత్సవం సందర్భంగా సైనికుల తల్లులతో ‘సాక్షి’ ముచ్చటించింది. తమ పిల్లలు సైన్యంలో పనిచేయడం తమకు గర్వంగా ఉందని, పాకిస్థాన్ చేస్తున్న దాడులతో కొంత భయపడుతున్నామని వారు పేర్కొన్నారు. తమ బిడ్డలకు రోజూ ఫోన్ చేసి జాగ్రత్తలు చెబుతున్నామన్నారు. ‘‘దేవుళ్లను నమ్ముకున్నోళ్లం, దేవుడి మీద భారం వేశాం’’ అని ఆ తల్లులు వివరించారు.
ఒక్కరితో మొదలై..
గ్రామానికి చెందిన గుట్టకాడి సంజీవరెడ్డి 15 ఏళ్లనాడు సైన్యంలో చేరారు. తర్వాత ఆయన స్ఫూర్తితో గ్రామానికి చెందిన యువత సైన్యంలో చేరసాగారు. గుట్టకాడి సంజీవరెడ్డి, మ్యాదరి ఎల్లేశ్, మర్రి మహేశ్, మర్రి ప్రశాంత్, లింగమ్మల మనోజ్, హన్మంతుల స్వామి, బెస్త సంజయ్, పీసు సంజీవరెడ్డి, టేకుల రాజు, దాసరి నరేశ్‌రెడ్డి, ఆకిటి ప్రశాంత్‌రెడ్డి, కీసరి నవీన్, కమ్మరి నవీన్, ప్రదీప్‌రావు, గొల్ల సంతోష్, మిద్దె కల్యాణ్, సుర్కంటి సతీష్‌రెడ్డి, సాయిరాంగౌడ్, రాజిరెడ్డి, ముదాం రాహుల్, సాకలి అనిల్, గాండ్ల భానుతేజ సైన్యంలో ఉన్నారు. దాదాపు అందరూ దేశ సరిహద్దు ప్రాంతాల్లోనే పనిచేస్తున్నారు.
సేవా కార్యక్రమాల్లోనూ ముందు..
గ్రామానికి చెందిన సైనికులంతా కలిసి సొంత డబ్బులతో గ్రామంలో ప్రధాన రహదారిపై సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. యువతను సైన్యంలో చేరాలంటూ ప్రోత్సహిస్తుంటారు. అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.
సైన్యంలో 23 మంది
తాడ్వాయివాసులు
దేశ సరిహద్దుల్లో యుద్ధమేఘాలతో
కొంత భయం
బిడ్డలకు జాగ్రత్తలు చెబుతున్న తల్లులు
నేడు మాతృ దినోత్సవం

నవమాసాలు కడుపున మోసి, కని పెంచిన కనిపించే దైవం అమ్మ.. ఆ