
సిద్ధరామేశ్వర ఆలయ అక్రమాలపై విచారణ చేపట్టాలి
భిక్కనూరు: మండల కేంద్రంలోని సిద్ధరామేశ్వరాలయంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని వెంటనే విచారణ చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు గురువారం వినతిపత్రం అందజేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, కాంగ్రెస్ మండల నేతలు అందె దయాకర్‌రెడ్డి, మైపాల్‌రెడ్డి, దుంపల మోహన్‌రెడ్డి, నీల అంజయ్య నర్మల రాంచంద్రం, మద్దురి రవి, జనార్దన్‌రెడ్డి, రాజు హైదారాబాద్‌లో మంత్రిని కలిసి ఆలయంలో పలువురు తీరుపై ఫిర్యాదు చేశారు.
ఆలయంలో హుండీ లెక్కింపులో ఓ ఉద్యోగి ప్రదర్శించిన చేతివాటంపై ఆలయ ఈవో అతనిని సహకరిస్తున్నారని ఈ విషయమై తగు విచారణ చేపట్టాలని కోరారు. అనంతరం మంత్రిని నాయకులు సన్మానించారు.