
కాలభైరవుడికి 108 స్వీట్లతో నైవేద్యం
రామారెడ్డి: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి (రామారెడ్డి) శ్రీ కాలభైరవుడి ఆలయంలో వైశాఖమాస రెండో మంగళవారం పురస్కరించుకొని స్వామివారికి 108 రకాల స్వీట్లతో నైవేద్యం సమర్పించారు. ఈసందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి అలంకరించే కరెన్సీ దండకు భక్తులు భారీగా విరాళాలు సమర్పించారు. మూడో మంగళవారం 108 రకాల కూరగాయలతో, నాలుగో మంగళవారం 108 రకా ల పూలతో కాలభైరవుడిని అలంకరిస్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఎండ వేడిమి తట్టుకునేందుకు టెంట్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు గుప్తా, అర్చకులు రాచర్ల శ్రీనివాసశర్మ, వంశీకృష్ణశర్మ, జూనియర్ అసిస్టెంట్లు లక్ష్మణ్, నాగరాజ్, మాజీ చైర్మన్ గంజి సతీష్‌గుప్తా పాల్గొన్నారు.
భైరవ నామసర్మణతో
మార్మోగిన రామారెడ్డి
భారీగా తరలివచ్చిన భక్తులు