
కార్యదర్శులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
కామారెడ్డి క్రైం: జీపీ కార్యదర్శులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని విధులకు సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లాలోని పలువురు పంచాయతీ కార్యదర్శులకు శుక్రవారం కలెక్టరేట్‌లో శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సలహాలు, సూచనలు అందజేశారు. అలాగే పంచాయతీ రాజ్ చట్టం, గ్రామ పంచాయతీ స్థాయిలో పారదర్శకతను పెంపొందించడం, సమాచార హక్కు చట్టం–2005, పంచాయతీ కార్యదర్శి పాత్ర, గ్రామసభ, సమాచార హక్కులాంటి అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. పంచాయతీ కార్యదర్శులు, రిసోర్స్ పర్సన్‌లు పాల్గొన్నారు.