నీళ్ల ట్యాంకుల వద్ద పిచ్చి మొక్కలు తొలగించాలి
కామారెడ్డి అర్బన్: పట్టణ పరిధిలోని కాకతీయ నగర్, దేవునిపల్లి నల్లపోచమ్మ మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకుల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో విష పురుగులు, తేళ్లు, పాములు సంచరించడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం కాకతీయనగర్ నీళ్ల ట్యాంక్ వద్ద స్థానికులు ఓ పామును చంపేశారు. కాగా ట్యాంక్ నుంచి నీళ్లు వదలడానికి ఎంతో భయపడాల్సి వస్తుందని వాటర్ మెన్ మీసాల రవి వాపోయారు. ట్యాంకుల వద్ద పిచ్చిమొక్కలు తొలగించడంతో పాటు మొరం పోసి చదును చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.
నీళ్ల ట్యాంకుల వద్ద పిచ్చి మొక్కలు తొలగించాలి


