మీనాక్షి నటరాజన్‌ను కలిసిన షబ్బీర్ అలీ
కామారెడ్డి టౌన్: ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను గురువారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. షబ్బీర్ అలీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉమ్మడి జిల్లా రాజకీయాలు, రాబోయే ఎన్నికలపై చర్చించినట్లు షబ్బీర్ అలీ తెలిపారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధిస్తామని వివరించినట్లు తెలిపారు.
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ గోడకు ఆనుకొని ఉన్న దుకాణాల వ్యాపారులకు మున్సిపల్ అధికారులు గురువారం తుది నోటీసులను జారీచేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం నిధులతో కామారెడ్డి రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే గోడకు ఆనుకొని ఉన్న మున్సిపల్ మడిగెలను ఖాళీ చేయాలని వ్యాపారులకు మున్సిపల్ అధికారులు గతంలో రెండుసార్లు నోటీసులను జారీచేశారు. మొత్తం 94 దుకాణాలకు తుది నోటీసులను 73 మందికి అందజేశారు. త్వరలో ఖాళీ చేయాలని, రైల్వే అభివృద్ధికి సహకరించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ 94 మంది వ్యాపారులకు సిరిసిల్లా రోడ్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం పక్కన, ప్రభుత్వ గంజ్ హైస్కూల్ ముందు ఉన్న మున్సిపల్ ఖాళీ స్థలంలో మడిగెలు నిర్మించి కేటాయిస్తామని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇటీవల ప్రకటించారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో రోడ్డు విస్తరణ పనులన్నీ ఒకే విధంగా చేపట్టాలని ఆర్డీవో పార్థసింహారెడ్డి నేషనల్ హైవే అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డిలో జరుగుతున్న మెదక్–ఎల్లారెడ్డి– రుద్రూర్ నేషనల్ హైవే పనులను గురువారం ఆర్‌అండ్‌బీ అధికారులు, ఆర్డీవో పరిశీలించారు. రోడ్డు వెడల్పు పనులలో భాగంగా విద్యుత్ స్తంభాలు, డ్రెయినేజీ, పైపులైన్ పనులను వారు తనిఖీ చేశారు. పట్టణంలో ఒకే విధంగా రోడ్డు వెడల్పు పనులను చేయాలని ఆర్డీవో పార్థసింహారెడ్డి అధికారులకు సూచించారు. అన్ని చోట్ల ఒకే విధంగా పనులు కొనసాగాలని, విబేధాలు లేకుండా పనులను చేయాలని అన్నారు.
ఎల్లారెడ్డి: సోమార్‌పేట్‌లో ఇటీవల చోటు చే సుకున్న దాడి ఘటన నేపథ్యంలో శుక్ర వా రం ఎల్లారెడ్డి బంద్‌కు అఖిలపక్షం నాయకు లు పిలుపునిచ్చారు. మండలంలోని సోమా ర్‌పే ట్ గ్రామంలో సర్పంచ్‌గా గెలుపొందిన పా పయ్య తమ్ముడు కుర్మ చిరంజీవి పలువురిపై ట్రాక్టర్‌తో దాడి చేయగా, ఐదుగురు గా యాలపాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లో చి కిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో కేవ లం చిరంజీవిపై మాత్రమే పోలీసులు కేసు నమో దు చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో అతడికి సహకరించిన సర్పంచ్ కుర్మ పాపయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్మ సాయిబాబాలపై సైతం కేసు నమోదు చేయా లని ఫిర్యాదు ఇచ్చినా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకోకపోవడంతో గ్రామస్తులతోపాటు అఖిలపక్షం నాయకులు ఎల్లారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి బంద్‌కు వ్యాపార, విద్యా సంస్థల వారు స్వచ్ఛందంగా సహకరించాలని వారు కోరారు.
మీనాక్షి నటరాజన్‌ను కలిసిన షబ్బీర్ అలీ
మీనాక్షి నటరాజన్‌ను కలిసిన షబ్బీర్ అలీ


