ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రామారెడ్డి: రామారెడ్డి మండలంతోపాటు, మాచారెడ్డి, దోమకొండ పాల్వంచ, బీబీపేట మండలాల ప్రజలు పులి సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్‌వో నిఖిత సూచించారు. అన్నారం ఇ సాయిపేట గ్రామాల శివారులలో బుధవారం రాత్రి అన్నారంలోని పిట్ల రాజయ్యకు చెందిన పశువుపై పులి దాడి చేసి చంపేసింది. ఈవిషయమై ‘సాక్షి’ డీఎఫ్‌వోను సంప్రదించగా, దాడి ఘటన వాస్తవమన్నా రు. ఈసందర్భంగా ప్రజలు పలు సూచనలు చేశా రు. పులి సంచరిస్తుందని ప్రజల జాగ్రత్తగా ఉండాల ని గ్రామాలలో డప్పు చాటింపు చేయిస్తున్నామని తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలు దాటిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అటవీ ప్రాంతాలలోకి వెళ్లకూడదని సూచించారు. పులి ఆచూకీ కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని అన్నారు. ఇప్పటికే పులి సంచరిస్తున్న అన్నిచోట్ల ట్రా క్ కెమెరాలను అమర్చినట్లుగా పేర్కొన్నారు. అటవీ జంతువులకు హాని కలిగించే విధంగా ప్రజలు ఎ లాంటి చర్యలు చేయకూడదని పేర్కొన్నారు.


