అనారోగ్య సమస్యలతో ఒకరి ఆత్మహత్య
బిచ్కుంద(జుక్కల్): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గుండెనెమ్లిలో చోటు చేసుకుంది. ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాటూరి రారెండ్డి (45) కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత కారణాలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నిజామాబాద్ అర్బన్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఐదుగురికి మెజిస్ట్రేట్ వారం రోజుల పాటు జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్‌అలీ గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ 17 మందిలో ఐదుగురికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించగా 11 మందికి రూ. పదివేలు, మరొకరికి రూ. పదిహేను వేలు చొప్పున జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ మహ్మద్ సోఫియన్, నగేశ్, ఇంతియాజ్, ఒడ్డె రాజు, విజయ్‌కుమార్‌కు వారం రోజుల పాటు మెజిస్ట్రేట్ జైలు శిక్షను విధించినట్లు ఏసీపీ తెలిపారు.
అనారోగ్య సమస్యలతో ఒకరి ఆత్మహత్య


