ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● అధికారులు, సిబ్బందికి అభినందన
కామారెడ్డి క్రైం: జిల్లాలో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు సత్యనారాయణరెడ్డిని గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కలెక్టర్ సన్మానించారు. సత్యనారాయణరెడ్డి పర్యవేక్షణలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్నారు. సమన్వయంతో పని చేయడం ద్వారా ఎన్నికలు పారదర్శకంగా జరిగాయన్నారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు సత్యనారాయణరెడ్డి జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, డీపీవో మురళి పాల్గొన్నారు.
కలెక్టర్‌కు సన్మానం
గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో పారదర్శకంగా పూర్తి చేయడంలో కీలకంగా వ్యవహరించిన వివిధ శాఖల అధికారులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అఽభినందించారు. ఆయా శాఖల అధికారులు, ఎంపీడీవోలు గురువారం కలెక్టర్‌ను తన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. జరిగిన ఎన్నికల్లో సంబంధిత శాఖల అధికారులందరూ బాధ్యతగా పని చేశారని కలెక్టర్ కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఎంపీడీఓలు, పలువురు అధికారులు కలెక్టర్‌ను శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు.
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు


