తగ్గిన లిక్కర్‌ అమ్మకాలు | - | Sakshi
Sakshi News home page

తగ్గిన లిక్కర్‌ అమ్మకాలు

Apr 17 2025 1:47 AM | Updated on Apr 17 2025 1:47 AM

తగ్గిన లిక్కర్‌ అమ్మకాలు

తగ్గిన లిక్కర్‌ అమ్మకాలు

ద్యం అమ్మకాలను ఆర్థిక సంవత్సరానికి లెక్కిస్తారు. ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు ఎంత మద్యం అమ్మారు? ఎంత ఆదాయం వచ్చింది? అంతకుముందు సంవత్సరం ఎంత ఆదాయం వచ్చిందని పరిశీలించి, వచ్చే ఏడాది ఎంత ఆదాయం పెరగవచ్చో అంచనా వేసుకుంటారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో మద్యం ధరలు పెరిగినప్పటికీ ఆదాయం మాత్రం పెద్దగా పెరగకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2023–24 సంవత్సరంలో జిల్లాలో మద్యం అమ్మకాల ద్వారా రూ. 551 కోట్ల ఆదాయం రాగా.. 2024–25 సంవత్సరంలో రూ. 559 కోట్లు మాత్రమే వచ్చింది. కేవలం రూ.8 కోట్ల ఆదాయం మాత్రమే పెరిగింది. పెరిగిన మద్యం ధరలకు అనుగుణంగా ఆదాయం భారీగా పెరగాల్సి ఉన్నా ఆ స్థాయిలో ఆదాయం పెరగకపోవడం గమనార్హం.

జిల్లాలో 49 వైన్‌ షాపులు, ఎనిమిది బార్లు ఉన్నాయి. పట్టణాల్లో గల్లీగల్లీలో, అలాగే దాదాపు అన్ని ఊళ్లలో బెల్ట్‌షాపులు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల బార్‌లను తలపించేలా ఏర్పాట్లు చేశారు. అంతటా బహిరంగంగానే మద్యం అమ్మకాలు నడుస్తున్నాయి. అయితే మద్యం ఆదాయం ఎందుకు పెరగలేదన్న దారికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైంది. భూములు, ప్లాట్ల అమ్మకాలు పడిపోయాయి. అలాగే వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగాయే తప్ప ఆదాయం వృద్ధి చెందలేదు. అకాల వర్షాలతోపాటు తెగుళ్లతో పంటలు దెబ్బతినడం, ఆపై భూగర్భజలాలు అడుగంటి పంటలు ఎండిపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. ఆయా కారణాల వల్ల జనం వద్ద డబ్బుల సర్దుబాటుకు ఇబ్బందులు పెరిగాయి. చాలా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో గతంలోలాగా మద్యం తాగడానికి కొందరు వెనకా ముందవుతున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో గతేడాది జ రగాల్సిన గ్రామ పంచాయతీ, మండ ల, జిల్లా పరిషత్‌ ఎన్నికలతో పాటు మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నా యి. ఎన్నికలు ఇప్పట్లో జరుగుతా యన్న నమ్మకం కూడా లేకుండాపోయింది. ఎన్నికల సీజన్‌లో సాధారణంగా మద్యం అమ్మకాలు రెట్టింపవుతాయి. అవి ఏడాది టార్గెట్‌ ను సులువుగా రీచ్‌ చేయగలుగుతాయి. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపేవారు నెల రెండు నెలల ముందు నుంచే ప్రలోభాల పర్వం మొదలుపెడతారు. ముఖ్యంగా దావత్‌లతో ఆకర్శి స్తుంటారు. ఈసారైనా ఎన్నికలు వస్తా యేమోనని ఎకై ్సజ్‌ శాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. టార్గెట్‌ను దాటాలంటే ఎన్నికలు రావలసిందేనన్న అభిప్రాయం ఆ శాఖ అధికారుల నుంచి వ్యక్తమవుతోంది.

పెరిగిన గుడుంబా, గంజాయి విక్రయాలు..

మద్యం ధరలు పెరగడంతో చాలా మంది తక్కువ ధరల్లో లభించే మత్తు పదార్థాల వైపు మళ్లుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబా అమ్మకాలు పుంజుకున్నాయి. అలాగే పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ యువత గంజాయికి అలవాటు పడుతున్నారు. సులువుగా గంజాయి లభిస్తుండడంతో యువకులు తక్కువ ధరల్లో దొరికే గంజాయితో మత్తు పీలుస్తున్నారు. దీనిని అరికట్టేందుకు ఎకై ్సజ్‌, పోలీస్‌ శాఖలు దాడులు నిర్వహిస్తున్నా దందా ఆగడం లేదు. గుడుంబా తయారీ, అమ్మకాలు కూడా యథేచ్ఛగా నడుస్తున్నాయి. గతంలో క్లోరోహైడ్రేట్‌తో తయారైన కల్లు దొరికేది. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో కల్లులో అల్ప్రాజోలం వాడుతున్నారు. ఎక్కువ మత్తు ఇస్తుండడంతో చాలామంది మందు కల్లు తాగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే జిల్లాకు పొరుగునే ఉన్న మహారాష్ట్రలో దేశీదారు తక్కువ ధరకు లభిస్తుంది. అక్కడి నుంచి అడ్డదారుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు దేశీదారు తరలివస్తోంది. వీటి ప్రభావంతోనూ జిల్లాలో మద్యం అమ్మకాలు పడిపోయినట్లు భావిస్తున్నారు.

ఊరూవాడా విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు కొనసాగుతున్నా.. జిల్లాలో మద్యం అమ్మకాలు మాత్రం తగ్గాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో రూ. 8 కోట్ల ఆదాయం మాత్రమే పెరిగింది. మద్యం ధరలు పెరగడంతో మందుబాబులు గుడుంబా, గంజాయి వంటివాటిని సేవిస్తున్నట్లు తెలుస్తోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

ఊరూవాడా బెల్టుషాపులు

విస్తరించినా పెరగని ఆదాయం

మద్యం అమ్మకాలు తగ్గడానికి

కారణాలు ఎన్నో..

‘స్థానిక’ ఎన్నికలపైనే

ఎకై ్సజ్‌ శాఖ ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement