ఆస్పత్రుల్లో హాజరుపై నిఘా! | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రుల్లో హాజరుపై నిఘా!

Apr 16 2025 11:01 AM | Updated on Apr 16 2025 11:01 AM

ఆస్పత

ఆస్పత్రుల్లో హాజరుపై నిఘా!

కామారెడ్డి టౌన్‌ : విధులకు డుమ్మా కొట్టేవారికి చెక్‌ పెట్టేందుకు వైద్యారోగ్య శాఖ నూతన హాజరు విధానాన్ని తీసుకురాబోతోంది. ఆధార్‌ బేస్డ్‌ బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ సిస్టమ్‌(అభాస్‌) అమలు చేయబోతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు, సిబ్బంది విధులకు హాజరైనా మధ్యలోనే వెళ్లిపోవడం, క్షేత్ర స్థాయి విధులకు వెళ్లామని చెప్పి తప్పించుకోవడం, విధులకు రాకపోయినా వచ్చినట్లు సంతకాలు చేయడంలాంటివి జరుగుతున్నట్లు వైద్యారోగ్య శాఖ గుర్తించింది. ఇలా వ్యహరించే ఉద్యోగులకు చెక్‌ పెట్టాలని నిర్ణయించింది. అలాంటి వారిపై ఇక ప్రత్యేక నిఘా ఉండనుంది. ఇందుకోసం కొత్త హాజరు విధానాన్ని ప్రవేశ పెట్టబోతోంది. అందులో కిందిస్థాయి సిబ్బందినుంచి ఉన్నతాధికారుల వరకు ఒకే రకమైన హాజరు విధానం ఉండనుంది.

జిల్లాలో మూడు ఏరియా ఆస్పత్రులు, ఏడు సీ హెచ్‌సీలు, 20 పీహెచ్‌సీలు, రెండు యూపీహెచ్‌సీ లు ఉన్నాయి. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు ఇ ప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ ఆస్పత్రు లు, కార్యాలయాల్లో పని చేసేవారి ఆధార్‌ వివరా లు సేకరించి, ఉన్నతాధికారులకు పంపించారు. అ భాస్‌ హాజరు విధానం అమలులోకి వస్తే.. మొబైల్‌ యాప్‌ ద్వారా లొకేషన్‌ ఆధారంగా హాజరు నమో దు చేయాల్సి ఉంటుంది. వైద్యులు, ఇతర సిబ్బంది ఆస్పత్రికి ఉదయం వచ్చిన తర్వాత, సాయంత్రం తిరిగి వెళ్లే సమయంలో తప్పనిసరిగా ఈ యాప్‌లో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో డుమ్మాలకు చెక్‌ పడుతుందని ఆశిస్తున్నారు.

వివరాలు పంపించాం

జిల్లాలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీ, సీహెచ్‌సీ లు, ఏరియా ఆస్పత్రుల నుంచి వైద్యులు, సిబ్బంది ఆధార్‌ వివరాలను సేకరించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు పంపించాం. నూతన హాజరు విధా నానికి సంబంధించి ఇంకా పూర్తిగా విధివిధానాలు ఖరారు కాలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలను అమ లు చేస్తాం. – చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌వో, కామారెడ్డి

వైద్యులు, సిబ్బంది డుమ్మాలకు

చెక్‌ పెట్టేందుకు చర్యలు

జిల్లాలోని ఆస్పత్రులలో పనిచేస్తున్నవారి వివరాల సేకరణ పూర్తి

త్వరలో ‘అభాస్‌’ హాజరు విధానం

అమలయ్యే అవకాశం

ఆస్పత్రుల్లో హాజరుపై నిఘా!1
1/1

ఆస్పత్రుల్లో హాజరుపై నిఘా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement