ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో) | - | Sakshi
Sakshi News home page

ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో)

Published Mon, Mar 24 2025 6:29 AM | Last Updated on Mon, Mar 24 2025 6:29 AM

ఆర్‌అ

ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో)

మైలారంలో కంకర రోడ్డుపై దుమ్ముతో ఇబ్బందిపడుతున్న వాహనదారులు

బీబీపేట నుంచి రాంరెడ్డిపల్లి మార్గంలో కంకర తేలిన రోడ్డు

రోడ్డు, రవాణా సౌకర్యాలు మెరుగుపడితేనే అభివృద్ధికి బాటలు పడతాయి. అందుకే ప్రభుత్వాలు

రోడ్ల నిర్మాణాలకు, అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంటాయి. అవసరానికి అనుగుణంగా

మట్టి రోడ్లను కంకర రోడ్లుగా.. తారు రోడ్లుగా.. డబుల్‌ రోడ్లుగా అభివృద్ధి చేస్తుంటాయి.

అయితే నాలుగైదేళ్లుగా రోడ్ల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరైనప్పటికీ బిల్లుల

చెల్లింపుల్లో తలెత్తిన సమస్యలతో చాలామంది కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే ఆపేశారు.

కొన్ని కొత్త పనులు మంజూరైనా చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

దీంతో ప్రజల రవాణా కష్టాలు తీరడం లేదు. జిల్లాలో రోడ్ల పరిస్థితిపై ‘సాక్షి’ ఫోకస్‌..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో చాలా ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లను అభివృద్ధి చేసే క్రమంలో కొ న్నిచోట్ల కంకర పరిచి వదిలేశారు. దుమ్ము లే స్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు, జిల్లా పరిషత్‌, ఆర్డీవో కార్యాలయాల వద్ద కంకర పరిచి ఏళ్లు గడుస్తోంది. మున్సిపల్‌, రోడ్లు భవనాలు, రైల్వే శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ పనులు ముందుకు సాగడం లేదు. రోడ్లు భవనాల శాఖ ద్వారా పాత బస్టాండ్‌ నుంచి పంచముఖి రైల్వే గేట్‌, అడ్లూర్‌ మీదుగా పోసానిపేట వరకు వెళ్లే రహదారి విస్తరణకు మూడేళ్ల క్రితం రూ.2 కోట్లు మంజూరవగా, పంచముఖి హనుమాన్‌ ఆలయం సమీపంలో డ్రెయినేజీపై వంతెన నిర్మించారు. అయితే వంతెనపై తారు వేయలేదు. ఈ రోడ్డు విస్తరణకు రాజకీయ గ్రహణం పట్టింది. జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తిరిగే రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే మారుమూల గ్రామాల రోడ్ల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది.

● కామారెడ్డి నుంచి రామారెడ్డి మీదుగా రెడ్డిపేటకు వెళ్లే రహదారిపై మద్దికుంట శివారులో అటవీ అనుమతులు రాక పనులు ఆగిపోయాయి. ఈ మార్గంలో ప్రయాణించేవారు ఇబ్బందిపడుతున్నారు.

● లింగంపేట మండలం నాగారం శివారులో వంతెన నిర్మించినా, గతేడాది వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయింది. తాత్కాలికంగా మొరం పోసి వదిలేశారు. వాహనాల రాకపోకలతో దుమ్మ లేస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

● పిట్లం మండల కేంద్రంలో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం పనులు ఆగిపోయాయి. పిట్లం నుంచి మద్దెలచెరువు, పిట్లం నుంచి కుర్తి వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి.

● తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి శివారులో వాగుపై వంతెన నిర్మించి రోడ్డుపై తారు వేయకుండా వదిలేశారు.

● దోమకొండ మండల కేంద్రం నుంచి ముత్యంపేట వరకు బీటీ రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి.

● మాచారెడ్డి మండలం మైసమ్మచెరువు తండా నుంచి తడ్కపల్లి వరకు బీటీ రోడ్డుకు నిధులు మంజూరైనా అటవీ అనుమతులు లేక పనులు ఆగిపోయాయి.

● బిచ్కుంద నుంచి కందార్‌పల్లి రోడ్డు అధ్వానంగా తయారైంది.

● రాజంపేట మండల కేంద్రం నుంచి మెదక్‌కు వెళ్లే రహదారిపై కొండాపూర్‌ శివారులో వంతెన నిర్మించినా రోడ్డుపై తారు విస్మరించారు.

● బాన్సువాడ మండలంలోని కోనాపూర్‌ – కాద్లాపూర్‌ రోడ్డు కంకర తేలి అధ్వానంగా ఉంది.

● ఇబ్రహీంపేట్‌ పంచాయతీలోని రేకుల కుంట తండాకు రోడ్డు కోసం కంకర వేసి ఏడాది అవుతున్నా తారు వేయలేదు.

● పెద్దకొడప్‌గల్‌ మండలంలోని అంజని గ్రామం నుంచి శివాపూర్‌ వెళ్లే రోడ్డుపై మూడేళ్ల క్రితం కంకరపోసి వదిలేశారు. ఈ మార్గంలో వాహనాల రాకపోకలతో విపరీతంగా దుమ్ములేస్తోంది. ఇలా జిల్లాలో చాలాచోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఆయా మార్గాలలో ప్రయాణిస్తున్నవారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కంకర రాళ్లతో వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయని, వాహనాలు చెడిపోతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు స్పందించి నిలిచిన పనులను పూర్తి చేయించాలని కోరుతున్నారు.

తారుకు నోచుకోని సర్దాపూర్‌ తండా –

కొత్తగూడెం తండా రోడ్డు

పిట్లంలో రోడ్డు విస్తరణలో కంకరవేసి వదిలేసిన దృశ్యం

పంచాయతీరాజ్‌ పరిధిలోని రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో)

బిల్లులు రాకపోవడమే సమస్య

కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో వారు పనులను మధ్యలోనే ఆపేశారని స్పష్టమవుతోంది. జిల్లాలో వివిధ పథకాల ద్వారా చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించి రూ. 30 కోట్లకుపైగా బిల్లులు రావాల్సి ఉందని తెలుస్తోంది. కాంట్రాక్టర్లు ఎవరిని కదిలించినా ఏళ్లుగా బిల్లులు రావడం లేదని, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండడం లేదని పేర్కొంటున్నారు. పాత బిల్లులు రాకపోవడంతో కొత్తగా మంజూరైన పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

రోడ్ల నిర్మాణానికి బిల్లుల గ్రహణం చాలాచోట్ల మధ్యలోనే ఆగిన పనులు

బిల్లులు రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు

నిధులు మంజూరైనా ప్రారంభం కాని పనులెన్నో..

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో)1
1/6

ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో)

ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో)2
2/6

ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో)

ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో)3
3/6

ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో)

ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో)4
4/6

ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో)

ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో)5
5/6

ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో)

ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో)6
6/6

ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు.. (కి.మీ.లలో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement