
ఆస్తి పన్ను చెల్లించని దుకాణాల సీజ్
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ పట్టణంలో ఆస్తి పన్ను చెల్లించని పలు దుకాణాలను ఆదివారం బల్దియా అధికారులు సీజ్ చేశారు. అనిల్ టాకీస్ రోడ్డులోని కేకే సూపర్ మార్కెట్, లక్ష్మి అపార్ట్‌మెంట్‌లోని దుకాణ సముదాయాలతోపాటు మరో దుకాణ సముదాయాన్ని సీజ్ చేశారు. దు కాణాదారులు బల్దియాకు రూ.3,16,629ల ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆస్తి పన్ను చెల్లించకపోతే దుకాణాలను సీజ్ చేస్తామని, ఇంటికి తాగునీటి సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు.
వాహనాల తనిఖీ
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని గోర్గల్ గ్రామ శివారులో ఆదివారం ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి ద్విచక్రవాహనం నడుపుతున్న ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.