కామారెడ్డి టౌన్: మధాహ్న భోజన కార్మికులకు రూ. 10 వేల వేతనం ఇవ్వాలని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రపాణి డీఈవో ఎస్.రాజుకు వినతిప్రతం అందజేశారు. ఈనెల 26న ఎండీఎం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిరసనకు జిల్లాలోని కార్మికులు తరలివచ్చి విజయంతం చేయాలని కోరారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలివెళ్లేందుకు ఒక రోజు అనుమతి ఇవ్వాలని డీఈవోకు కోరారు. కార్మికులు అంబవ్వ, సంగీత తదితరులున్నారు.