నీరందక దిగుబడులపై ప్రభావం.. | - | Sakshi
Sakshi News home page

నీరందక దిగుబడులపై ప్రభావం..

Mar 21 2025 1:26 AM | Updated on Mar 21 2025 1:22 AM

జిల్లాలో 2.61 లక్షల ఎకరాల్లో

వరి సాగు

5.63 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం

సేకరణ లక్ష్యం

424 కొనుగోలు కేంద్రాల

ఏర్పాటుకు నిర్ణయం

ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం

కామారెడ్డి క్రైం : యాసంగి సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం సేకరణకు వేళయ్యింది. ముందుగా నాట్లు వేసిన ప్రాంతాలలో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా 424 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు.. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో యాసంగి సీజన్‌లో 2,61,110 ఎకరా ల్లో వరి సాగయ్యింది. ఇందులో దొడ్డు రకం వరి ధా న్యాన్ని 2,03,665 ఎకరాల్లో, సన్నరకం 57,445 ఎకరాల్లో సాగు చేశారు. 4,88,796 మెట్రిక్‌ టన్నుల దొ డ్డు రకం, 1,32,121 మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధా న్యం దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అధికా రులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 6,10,917 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి రావ చ్చని భావిస్తున్నారు. ఇందులో నుంచి రైతుల ఇంటి అవసరాలకుపోను కొనుగోలు కేంద్రాలకు 5.63 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేసిన అధికారులు.. ఆ మేరకు ధాన్యాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్‌లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్‌లు, ఇతర సామగ్రితోపాటు మౌలిక సదుపాయాలను సమకూర్చే పనిలో ఉన్నారు. 1.40 కోట్ల గన్నీ సంచులు అవసరం ఉండగా ప్రస్తుతం 12.18 లక్షలు అందుబాటులో ఉన్నాయి. మిగతావి ఎప్పటికప్పుడు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సింగిల్‌ విండోలు, ఐకేపీ ఆధ్వర్యంలో..

యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణ కు జిల్లాలో 424 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 397 కేంద్రాలను సింగిల్‌ విండో ఆధ్వర్యంలో, 27 కేంద్రాలను ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. వీటిలో 63 కేంద్రాలలో కేవలం సన్న రకం ధాన్యం సేకరిస్తారు. గ్రేడ్‌– ఏ ర కం ధాన్యానికి క్వింటాలుకు రూ. 2,320, సాధారణ రకానికి రూ. 2,300 మద్దతు ధర చెల్లిస్తారు. కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ఇటీవల సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై దిశానిర్దేశం చేశారు. త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని, అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఏర్పాట్లు చేస్తున్నాం

జిల్లాలో 5.63 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం కొ నుగోలు కేంద్రాలకు రావొ చ్చని అంచనాలు వేశాం. ఇందుకు అనుగుణంగా 424 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – రాజేందర్‌, డీఎం,

సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌, కామారెడ్డి

యాసంగి సీజన్‌ ప్రారంభంలో భూగర్భ జలా లు సమృద్ధిగా ఉండడంతో రైతులు వరి సాగు కు ఆసక్తి చూపారు. దీంతో జిల్లావ్యాప్తంగా 2,61,110 ఎకరాల్లో వరి సాగయ్యింది. అయి తే ఎండలు ముదురుతుండడంతో కొద్ది రోజు లుగా భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీంతో బోరుబావులు ఎత్తిపోతుండడంతో సా గు నీటికి తిప్పలు తప్పడం లేదు. నిజాంసాగ ర్‌ ఆయకట్టు ప్రాంతమైన బాన్సువాడ రూర ల్‌ తదితర ప్రాంతాల్లోని చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరందే పరిస్థితి లేకుండా పో యింది. నీరందక పంటలు ఎండుముఖం పడుతుండడంతో ఈసారి ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవచ్చని భావిస్తున్నారు.

నీరందక దిగుబడులపై ప్రభావం.. 1
1/1

నీరందక దిగుబడులపై ప్రభావం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement