సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో బీజేపీ నాయకులు అధికారుల వ్యవహార శైలిపై బహిరంగంగా నిప్పులు చెరుగుతున్నారు. అధి కారంలో ఏ పార్టీ ఉన్నా.. సుదీర్ఘకాలం సర్వీసు లో ఉండే బ్యూరోక్రాట్లు, అధికారులు, ఉద్యోగు లు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నిష్పక్షపాతంగా పనిచేయాల్సి ఉండగా, తరచూ వివాదాస్పదమవుతున్నారు. ఈ పరిస్థితులు సాధారణ ప్రజల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఇలా వివాదాలకు కేరాఫ్‌గా మారుతుండడంపై విమర్శలు వస్తున్నాయి.
● కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి శాసనసభలోనే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల తీరుపై ని ప్పులు చెరిగారు. కామారెడ్డిలో విద్య, వైద్య శాఖల్లో వివిధ అంశాలకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద 86 దర ఖాస్తులు ఇస్తే ఏమాత్రం సమాధానాలు ఇవ్వలేదన్నారు. పైగా తానే స్వయంగా దరఖాస్తు ఇవ్వడానికి వెళి తే ఇలాంటివి చాలా చూశాం.. అ య్యేవా.. పోయేవా అంటూ ఉద్యోగులు, అధికారు లు మాట్లాడారన్నారు. అధికారులకు ఇది మంచి పద్ధతి కాదని, సదరు అధికారుల పేర్లు సైతం చెప్పగలుగుతానన్నారు. సమాచారం ఇచ్చేది లేద ని అధికారులే అంటే ఎలా అన్నారు. ప్రతీది ఫైల్ తో సహా తనవద్ద ఉందన్నారు. అధికారులు గౌర వంగా వ్యవహరిస్తే బాగుంటుందన్నారు. ఈ ప్రవర్తన అందరికీ సిగ్గుచేటన్నారు. పద్ధతి మార్చుకోకుండా రాబోయే కాలంలో తన పద్ధతి మార్చుకునేలా చేస్తారా అని అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో ఓ డినవారు, నియోజకవర్గం నుంచి పారిపోయిన వారి పేరిట ప్రతిపాదనలు ఇవ్వడమేమిటి.. ఇన్‌చార్జి మంత్రి మంజూరు చేయడమేమిటన్నారు. ఇలా అయితే ప్రజల ద్వారా ఎన్నికైన తానేం చేయాలంటూ పరోక్షంగా షబ్బీర్ అలీపై కేవీఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు.
● తాజాగా నిజామాబాద్‌లో కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని పసుపు బోర్డు సమావేశంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి నేరుగా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుపైనే విమర్శలు సంధించారు. జనవరిలో పసుపు బో ర్డు తాత్కాలిక కార్యాలయాన్ని వర్చువల్ విధానంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో నిర్వహించేందుకు కలెక్టర్‌ను సంప్రదించగా.. పండుగ సమయంలో ఎవరూ అందుబాటులో ఉండరంటూ కార్యక్రమ నిర్వహణకు తిరస్కరించారని గంగారెడ్డి అధికారిక సమావేశంలో నే తెలిపారు. కొన్ని అపోహలు తొలగించేందుకు ఈ విషయాన్ని జిల్లా ప్రజలకు తెలపాల్సిన బాఽ ద్యత తనపై ఉందన్నారు. దీనిపై రైతులు, ఉన్నతాధికారుల్లో చర్చ జరిగింది. మంగళవారం పసుపు బోర్డు ఆధ్వర్యంలో సీనియర్ ఐఏఎస్‌లు, జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొన్న సమావేశం గురించి సైతం జిల్లా పౌరసంబంధాల అధికారికి తెలియకపోవడం గమనార్హం.
● జక్రాన్‌పల్లి మండలం లక్ష్మాపూర్‌లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా స్టోన్ క్రషర్ నిర్వహించడంపై కేఆర్ సుదర్శన్‌రెడ్డి అనే వ్యక్తి సమాచార హ క్కు చట్టం ద్వారా పూర్తి వివరాలు తీసుకుని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమ క్రషర్ నిర్వాహకుడికి అనేకసార్లు నోటీసులు ఇచ్చారు. చర్యలు తీసుకోలేదని అడిగితే ఆ విషయమే తమకు తెలియదని కలెక్టర్, అదనపు కలెక్టర్ చెబుతున్నారని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. దీనిపై సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై నిప్పులు
చెరుగుతున్న బీజేపీ నేతలు
ఆర్‌టీఐ దరఖాస్తులను
పట్టించుకోవడంలేదంటూ అసెంబ్లీలో
ప్రస్తావించిన ఎమ్మెల్యే కేవీఆర్
పసుపు బోర్డు ప్రారంభ సమావేశానికి సహకరించని జిల్లా కలెక్టర్
కలెక్టరేట్‌లో ఏర్పాటు చేయనీయలేదు
: బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి