లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన ఆవుల యజమానులపై లింగంపేట పోలీస్ స్టేషన్‌లో సోమవారం స్థానిక రైతులు ఫిర్యాదు చేశారు. ఆవుల యజమానులు వారి పశువులను ఇష్టానునుసారంగా వదిలేయడంతో పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు తెలిపారు. దీంతో పంటను నష్టపోతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలో ఆవుల యజమానులు చేపూరి కృష్ణమూర్తి, శెట్పల్లి రాములు, మంగళి విఠల్, పోతపల్లి సాయిలుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతులు వెంకట్‌గౌడ్, గురుప్రసాద్, లక్ష్మన్, సాయిలు, ఆలియా, కాశీరాం, బాలయ్య తదితరులు ఉన్నారు.