సాధన చేశారు.. సాధించారు.. | - | Sakshi
Sakshi News home page

సాధన చేశారు.. సాధించారు..

Jul 22 2023 12:34 AM | Updated on Jul 22 2023 8:48 AM

- - Sakshi

నిజామాబాద్: సర్కార్‌ బడుల్లో చదువుతున్న విద్యార్థుల ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపాధ్యా యుల ప్రోత్సాహంతో అందిపుచ్చుకుంటున్నారు. ఇటీవల ప్రకటించిన జాతీయ ప్రతిభా ఉపకార వేత నాల(ఎన్‌ఎంఎంఎస్‌) ఫలితాలే అందుకు నిదర్శ నం. ఈ స్కాలర్‌షిప్‌కు ఉమ్మడి జిల్లాలో 205 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సాహించాలని కేంద్ర ప్రభు త్వం మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ అందజేస్తుంది.

ఎనిమిది, తొమ్మది తరగతి విద్యార్థులకు పరీక్ష పెట్టి ఎంపికైన ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇంటర్‌ వరకు ఉపకారం వేతనం అందజేస్తోంది. ఈ ఏడాది నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తాచాటి 205 మంది ఉపకార వేతనానికి ఎంపికయ్యారు. నిజామాబాద్‌ జిల్లా నుంచి 130 మంది, కామారెడ్డి జిల్లా నుంచి 75 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.

చొరవ చూపితే మరింత ప్రయోజనం

ఉమ్మడి జిల్లాలో కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల చేత దరఖాస్తు చేయించాడనికే పరిమితం కాకుండా విద్యార్థులు పరీక్షలో విజయం సాధించే విధంగా శిక్షణనిస్తున్నారు. దీంతో ఆయా పాఠశాల విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు ఎంపికవుతున్నారు. కానీ చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు దీనిపై చొరవ చూపడం లేదు. కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నా.. ఉపాధ్యాయుల అలసత్వంతో ఉమ్మడి జిల్లాలో అనేకమంది విద్యార్థులు ఉపకార వేతనానికి దూరమవుతున్నారు.

ఆయా ప్రభుత్వ పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులతో దరఖాస్తులు చేయించి పరీక్ష రాయించాల్సి ఉన్నా.. కొందరు మాత్రమే చొరవ తీసుకొని దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఉపాధ్యాయులు చొరవ చూపి విద్యార్థులను పరీక్షకు సిద్ధం చేస్తే మరింత మందికి ప్రయోజనం కలుగుతుంది.

ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు అందేలా టీచర్లు ప్రోత్సహించాలి. దీంతో విద్యార్థులు లబ్ధి పొందుతారు. అన్ని పాఠశాలల్లో టీచర్లు ఈ విధంగా కృషి చేయాలి. – దుర్గాప్రసాద్‌, డీఈవో

ఈ చిత్రంలో కనిపిస్తున్న వేల్పూర్‌ మండలం మోతె ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ ప్రతిభా ఉపకార వేతనాని(ఎన్‌ఎంఎంఎస్‌)కి ఎంపికయ్యారు. ఈ పాఠశాల ఉపాధ్యాయులు చొరవ చూపి విద్యార్థులతో దర ఖాస్తులు చేయించి పరీక్షలో విజయం సాధించే విధంగా శిక్షణ ఇస్తున్నారు. దీంతో ప్రతిసారి ఈ పాఠశాల నుంచి విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు ఎంపిక అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement