
నిజామాబాద్‌నాగారం: ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సీపీ నాగరాజు పేర్కొన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విశిష్ట సేవా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి సీపీ హాజరై మాట్లాడారు. తన పదవీకాలం అనంతరం ఇలాంటి సంస్థ స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. అనంతరం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతినిధులు కార్తీక్, ఆదిత్య, సురేష్, వినోద్, గంగారాం,అనిల్, గణేష్‌ను సన్మానించారు. సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు,దారం గంగాధ ర్, లక్కంపల్లి సంజీవ్ రావ్, సుజాత, వాల బాలకిషన్, సుభాష్, వినయ్, అమర్, సతీష్ పాల్గొన్నారు.
గూగుల్‌లో కస్టమర్‌కేర్ నంబర్ వెతికితే..
● ఖాతాలో నుంచి
రూ.రెండు లక్షలు మాయం
నిజామాబాద్ సిటీ: గూగుల్‌లో కస్టమర్‌కేర్ నంబర్ సెర్చ్ చేసి ఓ యువకుడు రూ.రెండు లక్షలు పోగొట్టుకున్నాడు. రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాలు.. చంద్రశేఖర్ నగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు ప్లిఫ్‌కార్ట్‌లో షూస్ బుక్ చేశాడు. దీంతో షిప్ రాకెట్ కొరియర్ నుంచి షూస్ వచ్చినట్లు అతనికి మెసేజ్ వచ్చింది. దీంతో ఆ యువకుడు షిప్ రాకెట్ కొరియర్ కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు. సెర్చింగ్ చేస్తున్న సమయంలో సైబర్ నేరగాళ్లు యువకుడికి కాల్ చేశారు. షిప్ రాకెట్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పమనగానే యువకుడు చెప్పాడు. దీంతో అతడి అకౌంట్‌లో నుంచి రూ.రెండు లక్షలు కట్ అయినట్లు మేసేజ్ వచ్చింది. దీంతో యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.