నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన వచ్చే నెల 2న రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) లీగ్ వాటర్‌స్పోర్ట్స్‌లో జిల్లా స్థాయి ఎంపికలు జరగనున్నాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) వి.సతీష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సబ్ జూనియర్స్ అండర్–15, జూనియర్స్ అండర్–18 విభాగాల్లో కెనాయింగ్, క్యాకింగ్, రోయింగ్, డ్రాగన్ బోట్‌లలో ఎంపికలుంటాయని వివరించారు. స్థానిక వివేకానంద పార్కు ఆవరణలో ఆ రోజు ఉదయం 8 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి ఉన్న వారు సొంత క్రీడా పరికరాలతో హాజరు కావాలన్నారు. క్రీడా యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరు కావాలని సూచించారు.
శిల్పారామంలో స్టాల్స్‌కు
దరఖాస్తుల ఆహ్వానం
కాకినాడ రూరల్: బీచ్ రోడ్డులోని శిల్పారామంలో ఖాళీగా ఉన్న స్టాల్స్‌ను సంప్రదాయ హస్తకళలు, చేనేత వస్త్ర వ్యాపారానికి కేటాయించేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పరిపాలనాధికారి మోహన్‌తేజ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. స్థానిక హస్తకళలను ప్రోత్సహించడంలో భాగంగానే వీటిని కేటాయిస్తున్నామన్నారు. ఆట వస్తువులతో పాటు ఎగ్జిబిషన్ ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారు ఏప్రిల్ 6వ తేదీలోగా శిల్పారామం కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని కోరారు,
మంగళసూత్రాలు,
పట్టు వస్త్రాల సమర్పణ
అన్నవరం: రత్నగిరిపై శుక్రవారం నిర్వహించిన సీతారాముల కల్యాణానికి బి.రామతీర్థ దంపతులు (విశాఖపట్నం) రూ.70 వేల విలువైన బంగారు మంగళసూత్రాలు, స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ త్రినాథరావు సమక్షంలో ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మకు వీటిని అందజేశారు.
నేడు పోలవరం తొలి కలెక్టర్
బాధ్యతల స్వీకరణ
రంపచోడవరం: పోలవరం జిల్లా తొలి కలెక్టర్‌గా నియమితులైన కె.దినేష్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్‌రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.


