ప్రమాదాలు తక్కువ | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాలు తక్కువ

Mar 28 2026 7:21 AM | Updated on Mar 28 2026 7:21 AM

పీఎన్‌జీలో మీథేన్‌ ఉంటుంది. అంటే దీని అణుభారం 16 యూనిట్లు. అదే సాధారణమైన గాలి అయితే అణుభారం 32 యూనిట్లు. అంటే పీఎన్‌జీ మనం పీల్చే గాలి కన్నా తక్కువ బరువు ఉంటుంది. అందువలన లీకైనా తొందరగా గాలిలో కలిసిపోతుంది. ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ. కానీ, ఎల్‌పీజీలో బ్యూటేన్‌ కలిసి ఉంటుంది. దీని అణుభారం 58 వరకూ ఉంటుంది. గాలి కన్నా బరువు ఎక్కువ. అందువలన లీకేజీ సమయంలో ఎక్కువ సమయం కిందనే ఉండిపోతుంది. దీనివలన ప్రమాదాలు జరిగితే తీవ్రత అధికంగా ఉంటుంది.

– పెచ్చెట్టి కృష్ణకిషోర్‌, కోనసీమ కాలుష్య అధ్యయనకర్త, అమలాపురం

ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాం

మా ఇంటికి పైపులైన్‌, మీటర్లు బిగించి ఆరేళ్లు దాటుతోంది. ఇప్పటి వరకూ గ్యాస్‌ సరఫరా మొదలు కాలేదు. దీని వల్ల ఎల్‌పీజీ సిలిండర్ల పైనే ఆధారపడాల్సి వస్తోంది. గ్యాస్‌ ఇబ్బందులు ఎదురవుతున్న ఈ సమయంలో పీఎన్‌జీ ఉంటే వినియోగదారులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వానికి సరఫరా భారం తగ్గుతుంది.

– మట్టపర్తి వీర వెంకట సత్యనారాయణ,

విశ్రాంత ఏఎస్సై, పోలీసు క్వార్టర్స్‌, అమలాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement