గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రత్తిపాడు: జాతీయ జాతీయ రహదారిపై ప్రతిపాడు వద్ద జరిగిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఎన్‌హెచ్‌పై నరేంద్రగిరి సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి, రోడ్డు పక్కన పడి ఉన్నాడు. ఆ దారిన వెళ్లే వ్యక్తులు 108కు ఫోన్ చేయడంతో క్షతగాత్రుడిని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది. ఎరుపు రంగు చొక్కా, సిమెంట్ రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 94407 96570, 94407 96530 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కోరారు.


