సందడిగా ‘శ్రీ ప్రకాష్ సినర్జీ’ వార్షికోత్సవం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ 11వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం స్కూల్ ప్రాంగణంలోని సీతా నరసింహక్షేత్ర ఆడిటోరియంలో బ్లిట్జ్–25 పేరుతో వేడుకలు నిర్వహించారు. విలువలే ప్రధానం అనే ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఆకట్టుకుంది. యోగా, జిమ్నాస్టిక్స్, త్వైకాండో, కలరీయపట్టు, కర్రసాము వంటి వాటిని ప్రదర్శించి అందరినీ అలరించారు. ముఖ్యంగా బుర్రకథ కళారూపాలు ఆకట్టుకున్నాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫారిన్ ట్రేడ్ కళాశాల విభాగాధిపతి డాక్టర్ వడ్లమూడి రవీంద్ర సారథి మాట్లాడుతూ శ్రీ ప్రకాష్ స్కూల్లో చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మరో ముఖ్య అతిథి డాక్టర్ వెల్లంకి సుమలత మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్నత విలువలను పెంచుతున్న శ్రీ ప్రకాష్ స్కూల్‌కు మంచి ఆదరణ ఉందన్నారు. పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ ప్రకాష్ మాట్లాడుతూ చదువుతో పాటు కళలు, సంస్కృతి, ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యం ఇస్తూ విద్యాబోధన సాగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, సినర్జీ ప్రిన్సిపాల్ ఎం.శ్రీదేవి, ప్లస్ వన్, టూ కో ఆర్డినేటర్ కె.విశ్వనాథ్, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
సందడిగా ‘శ్రీ ప్రకాష్ సినర్జీ’ వార్షికోత్సవం


