స్క్వాష్ పోటీలకు రాష్ట్ర జట్టు పయనం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ నెల 10 నుంచి 15 వరకు జరిగే జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ స్క్వాష్ పోటీలకు రాష్ట్ర జట్టు పయనమైందని ఎస్‌జీఎఫ్‌ఐ అడ్మిన్ కార్యదర్శి సుధారాణి బుధవారం తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే 10 మంది క్రీడాకారులకు ఎస్‌జీఎఫ్‌ఐ తరఫున క్రీడా కిట్లను డీఈఓ పి.రమేష్ చేతుల మీదుగా అందజేశామన్నారు. జట్టుకు కోచ్, మేనేజర్‌గా నాగమణి, మంగతాయారు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి శ్రీను, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ రమేష్ మాట్లాడుతూ క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలలో రాణించి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.


