వినాయకుని వెండి ఆభరణాల చోరీ
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలం ఆర్పీపట్నం గ్రామంలోని శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో చోరీ జరిగింది. సుమారు రూ.10 లక్షల విలువైన వెండి ఆభరణాలను దొంగలు దోచుకుపోయారు. బుధవారం ఉదయం అర్చకులు, ఆలయ కమిటీ నాయకులు వచ్చేసరికీ గుడి తలుపులు తెరచి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా ఆలయంలో ఏడు కేజీల వెండి ఆభరణాలు దొంగతనానికి గురైనట్టు గుర్తించారు. వెంటనే పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై మౌనిక తన సిబ్బందితో వచ్చి సమాచారం సేకరించారు. వేలి ముద్ర నిపుణులు, డాగ్ స్వ్కాడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
గండేపల్లి: జాతీయ రహదారిపై మురారి సమీపంలో పోలవరం కాలువ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు బుధవారం గుర్తించారు. గండేపల్లి ఎస్సై యూవీ శివనాగబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి ఒంటిపై మెరున్ కలర్ నిక్కరు, లేత రంగు చొక్కా ఉన్నాయన్నారు. అతడి వయసు సుమారు 75 ఏళ్లు ఉంటుందని, దాదాపు 5.3 అడుగుల ఎత్తు ఉన్నట్టు తెలిపారు. కుడికాలి పాదానికి మైకా కవర్ కట్టి ఉందని, మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
వినాయకుని వెండి ఆభరణాల చోరీ


