జాతి మీడియాకు, జాతీయ మీడియాకు ఒకటే పాటా!
కాకినాడ రూరల్: జాతి మీడియాకు జాతీయ మీడియాకు ఒకటే పాట పాడితే అర్నాబ్ గోస్వామి వంటి వ్యక్తి తగులుతాడని టీడీపీ అధికార ప్రతినిధులు ఊహించలేకపోయారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ జర్నలిస్టు కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడేదో వార్ రూమ్ ఉన్నట్టు.. మొన్నటి మోంథా తుపానును చంద్రబాబు నాయుడు చేయి అడ్డు పెట్టి ఆపినట్టు.. వుమెన్ క్రికెట్‌ను లోకేష్ గెలిపించినట్టు ఆయన జాతి మీడియా జాకీలు వేసి లేపిందని.. అదే ట్రిక్ ఇండిగో సంక్షోభంపై ప్లే చేద్దామని చూస్తే తలకిందులైందని ఎద్దేవా చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్‌నాయుడుకు యర్రన్నాయుడి తనయుడిగా గౌరవం ఉండేదని, మంత్రిగా 18 నెలల్లో రాష్ట్రానికి ఆయన ఉపయోగపడిందేమీ లేదని, విశాఖపట్నం భోగాపురం ఎయిర్‌పోర్టు వద్ద ఫొటోలు, రీల్స్‌తో బిల్డప్ ఇవ్వడం తప్ప ఆయన మార్క్ ఏమీ లేదని విమర్శించారు. లోకేష్‌ను చంద్రబాబు ఒక శక్తిగా చూపడానికి, పైకి లేపడానికి బూటక యత్నాలు సాగిస్తున్నారన్నారు. సొంత పత్రికలు, చానల్స్ ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు చూపుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత సాక్షి చానల్ ప్రసారాలను, కొద్దోగొప్పో న్యూట్రల్‌గా ఉన్న ఎన్‌టీవీ, టీవీ–9లను ఆపేశారని మండిపడ్డారు. చంద్రబాబును పొగడటమే పనిగా పెట్టుకున్న చానల్స్, లోకేష్‌ను జాకీ పెట్టుకుని లేపడమే పనిగా పెట్టుకున్న చానల్స్ తప్ప మరో చానల్ ఏదీ రాష్ట్రంలో ఉండకూదడనేది చంద్రబాబు ప్రయత్నమన్నారు. ఆయనంత దుర్మార్గమైన పరిపాలన దేశంలో ఎవరూ చేయరని, ప్రచార యావ తప్ప ఆయనకు ఇంకేమీ లేదని దుయ్యబట్టారు. అర్నాబ్ గోస్వామికి సమాధానం చెప్పలేక జాతీయ మీడియాను బ్యాన్ చేయడమేమిటని కన్నబాబు ప్రశ్నించారు. ఎంత కాలం బ్యాన్ చేస్తారని, సాక్షి మాదిరిగా జాతీయ మీడియాను బ్యాన్ చేస్తే చెల్లుబాటవుతుందని అనుకుంటున్నారా అని నిలదీశా రు. ఇదీ సోషల్ మీడియా యుగమని, ఇప్పుడు ఎవ్వరి వాయిస్ ఆపలేరని, చంద్రబాబును జాకీలు ఎత్తి లేపే కార్యక్రమంలో ఏబీఎన్, ఈనాడు శక్తిమంతంగా పని చేస్తున్నాయని, టీవీ–5 ఒక అడుగు ముందే ఉంటుందని విమర్శించారు. అర్నాబ్ గో స్వామిపై ఎందుకు మాట్లాడటం లేదని, ఇక్కడి మాదిరిగా అక్కడ కూడా రెడ్‌బుక్ వాడేందుకు దమ్ము సరిపోవడం లేదని ఆక్షేపించారు. ‘ఢిల్లీలో మీ చక్రం తిరుగుతోంది కదా అన్నారు. నిజాయితీగా ఒక వార్త రాస్తే రాష్ట్రంలో బతకనివ్వబోమని కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నారని మండిపడ్డారు. లోకేష్ వార్ రూమ్ ఏమిటి, మంత్రి ఎవరు? రామ్మోహన్‌నాయుడు కదా.. ఆయనెందుకు ప్రజలకు సమాధానం చెప్పడని అర్నాబ్ గోస్వామి నేరుగా అడుగుతున్నారన్నారు. రాజ్యసభ, లోక్‌సభలో రామ్మోహన్‌నాయుడు మాట్లాడితే ఎలివేట్ చేస్తున్నారని అన్నారు. పౌర విమానయానం 91 శాతం రెండు సంస్థల చేతిలో ఉండిపోయిందని, రాజమండ్రి నుంచి, విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే రూ.10 వేల నుంచి రూ.15 వేలు అవుతోందని, విమానయానంలో మన దేశంలో జరుగుతున్నంత దోపిడీ ఎక్కడా జరగదని కన్నబాబు అన్నారు. విమానం ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో తెలియదన్నారు. దేశంలోని అన్ని శాఖలకూ సకల శాఖ మంత్రిగా లోకేష్ వ్యవహరిస్తున్నారని, రామ్మోహన్‌నాయుడిని పని చేయనివ్వరా అని ప్రశ్నించా రు. ఇక్కడ వార్ రూమ్‌తో విమానాలన్నింటినీ నడిపించే శక్తి లోకేష్‌కు ఉందా అని ప్రశ్నించారు. అర్నా బ్ గోస్వామి చేతిలో వీరు దొరకపోతే లోకేషే అన్నీ నడిపిస్తున్నట్టు ప్రచారం చేస్తారని, ఇంత అరాచకం జరుగుతూంటే ప్రజలు చూస్తారనే భయంతో సాక్షి గొంతు నొక్కేస్తారా అని కన్నబాబు నిలదీశారు.
ఫ అర్నాబ్ గోస్వామి లాంటి వారు
తగులుతారని ఊహించి ఉండరు
ఫ భోగాపురం ఎయిర్‌పోర్టు రీల్స్‌తో
రామ్మోహన్‌నాయుడి బిల్డప్
ఫ మాజీ మంత్రి కన్నబాబు విమర్శ


