ఎస్‌టీయూ నూతన కార్యవర్గం
సత్యనారాయణ
రామకృష్ణ
రామ్‌తేజ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఎస్‌టీయూ జిల్లా 79వ కౌన్సిల్ సమావేశం రామారావుపేటలోని ఎస్‌టీయూ భవన్‌లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శేశెట్టి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా పోతు రామకృష్ణ, ఆర్థిక కార్యదర్శిగా గుమ్మపు రామ్‌తేజలు ఎన్నికయ్యారు. వారిని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మోర్త శ్రీనివాస్, కుసుమంచి కాశీ విశ్వనాథ్, పీవీ సత్యనారాయణరాజు, శ్రీను, రాజు, వెంకటేశ్వరరావు అభినందించారు. వెంటనే 12వ పీఆర్‌సీ కమిటీ చైర్మన్‌ను నియమించి, ఉద్యోగ, ఉపాధ్యాయులకు తక్షణం 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సరెండర్ లీవు బకాయిలతో పాటు పదో తరగతి వంద రోజుల ప్లానింగ్‌లో సెలవుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా తీర్మానించారు.
ఎస్‌టీయూ నూతన కార్యవర్గం
ఎస్‌టీయూ నూతన కార్యవర్గం


