జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో 3 పతకాలు
సామర్లకోట: జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్‌లో సామర్లకోటకు చెందిన యాతం నాగబాబు 3 పతకాలు సాధించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆది, సోమవారాల్లో ఈ పోటీలు జరిగాయి. ఇందులో 1,500 మీటర్ల పరుగులో ఒక రజతం, 800, 400 మీటర్ల పరుగులో రెండు కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీల్లో 22 రాష్ట్రాల నుంచి 1,254 మంది అథ్లెట్లు పాల్గొన్నారని నాగబాబు ఈ సందర్భంగా తెలిపారు. 2013 నుంచి ఈ ఏడాది వరకూ జరిగిన వివిధ జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్ పరుగు పందెంలో 100, 200, 400, 800, 1,500 మీటర్లతో పాటు రిలే విభాగాల్లో 68 పతకాలు సాధించానని వివరించారు. వీటిలో 20 బంగారు, 23 రజత, 25 కాంస్య పతకాలున్నాయని తెలిపారు. 55 ఏళ్ల వయస్సులోను పతకాలు సాధిస్తున్న నాగబాబును పలువురు అభినందించారు. ఆయన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైద్య, ఆరోగ్య శాఖ మలేరియా విభాగంలో పని చేస్తున్నారు.
నేటి నుంచి సౌత్ జోన్
వాలీబాల్ పోటీలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల వాలీబాల్ పోటీలు బుధవారం నుంచి కాకినాడలో ఐదు రోజుల పాటు జరగనున్నాయి. అసోషియేషన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ఆధ్వర్యాన నిర్వహించే ఈ పోటీలకు జేఎన్‌టీయూకే వేదిక కానుంది. వర్సిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జేఎన్‌టీయూకే వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 14 వరకూ జరిగే ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం నుంచి 138 జట్లు పాల్గొంటున్నా యని వివరించారు. ఈ జట్లను నాలుగు పూల్స్‌గా విభజించామన్నారు. పూల్–ఎ, బి మ్యాచ్‌లు జేఎన్‌టీయూకే, పూల్–సి అచ్చంపేట రాజీవ్‌గాంధీ కళాశాల, పూల్–డి సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో జరుగుతాయని వివరించారు. రాత్రి వేళ ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో సైతం మ్యాచ్‌లు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పోటీల్లో 1,960 మంది క్రీడాకారులతో పాటు 360 మంది కోచ్‌లు, మేనేజర్లు, వాలీబాల్ టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొంటారని తెలిపారు. ఈ టోర్నీలో ప్రతిభ చూపిన వారు మణిపాల్ జైపూర్ యూనివర్సిటీలో నిర్వహించే ఆలిండియా అంతర్ వర్సిటీ పోటీలకు అర్హత సాధిస్తారని వీసీ ప్రసాద్ చెప్పారు.
పీఎంజీఎస్‌వైతో
గ్రామాలకు మేలు ˘
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) గ్రామాలకు ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. ఈ పథకం ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యాన జేఎన్‌టీయూకేలో వర్సిటీ సహకారంతో ఏర్పాటు చేసిన రెండు రోజుల సెమినార్ మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ పథకం కింద 2000 సంవత్సరంలో ప్రారంభించిన రోడ్లను, ఇతర ప్రాజెక్టులను ఇప్పుడు తిరిగి పరిశీలించాలన్నారు. ప్రస్తుత జనాభా, అవసరాలను దృష్టిలో ఉంచుకుని రీలైనింగ్, రోడ్ల విస్తరణ వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. పంచాయతీరాజ్ సీఈ బాలునాయక్, జేఎన్‌టీయూకే వీసీ సీఎస్‌ఆరేకే ప్రసాద్ కూడా ప్రసంగించారు.
జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో 3 పతకాలు
జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో 3 పతకాలు


