ఎట్టకేలకు శానిటరీ సిబ్బందికి జీతాలు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య(శానిటరీ) సిబ్బందికి అక్టోబర్ జీతాలు ఎట్టకేలకు బుధవారం వారి బ్యాంకు ఖాతాలకు జమయ్యాయి. గతంలో గుంటూరుకు చెందిన కనకదుర్గా సంస్థ శానిటరీ కాంట్రాక్ట్ నిర్వహించినపుడు ఇలాగే జీతాలు ఆలస్యమయ్యేవి. ప్రస్తుతం దేవస్థానం శానిటరీ నిర్వహణను తిరుపతికి చెందిన పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సంస్ధ అక్టోబర్ నుంచి నిర్వహిస్తోంది. ఈ సంస్థ నవంబర్ 24వ తేదీ వచ్చినా శానిటరీ సిబ్బందికి అక్టోబర్ వేతనాలు చెల్లించలేదు. దీనిపై గత నెల 25న ‘సాక్షి’లో ‘పేరు మారినా తీరు మారలేదు’ శీర్షికన కథనం వెలువడింది. దీనిపై స్పందించిన అధికారులు ఆ సంస్థపై ఒత్తిడి తేవడంతో సిబ్బంది జీతాలు జమ చేశారు. ఈ నెల 413 మందికి జీతాల కింద లేబర్‌కు రూ.10,555, మేసీ్త్రకి రూ.15,575 వంతున సుమారు రూ.60 లక్షలు చెల్లించారు.


