గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వెలికితీత
కిర్లంపూడి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యంపై సోమవారం కేసు నమోదైనట్టు హెడ్ కానిస్టేబుల్ మూర్తి తెలిపారు. మండల పరిధి వేలంకలోని విద్యుత్ సబ్ స్టేషన్ పక్కనే ఉన్న కాలువలో స్థానికులకు మృతదేహం కనబడడంతో వీఆర్‌ఓ ఇప్పర్తి దేవ సహాయం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి 35–45 వయసు ఉంటుంది. బ్లూ టీషర్టు, షార్టు దుస్తులు వేసుకున్నట్లు తెలిపారు. వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ప్రత్తిపాడు పీహెచ్‌సీకు తరలించారు.
వీరేశ్వరస్వామి నిత్య కల్యాణం టిక్కెట్ల విడుదల
ఐ.పోలవరం: నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి 2026 జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించిన నిత్య కల్యాణాల టిక్కెట్‌లను సోమవారం విడుదల చేశారు. ఆలయ పాలక మండలి చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వి.సత్యనారాయణ లాంఛనంగా విడుదల చేశారు. మొత్తం 58 రోజులకు సంబంధించి 6,728 కల్యాణాలకు గాను ఆన్‌లైన్‌లో 5,220, కార్యాలయంలో 1,508 అందుబాటులో ఉంటాయన్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి నిత్య, మాస, వార్షిక పూజలు, రుద్ర హోమం, చండీ హోమం, లక్ష పత్రి పూజ, మహా శివరాత్రికి ద్వాదశ పుష్కర నదీ జలాభిషేకం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వెలికితీత


