విద్యార్థులతో కలిసి చిందులేసిన స్టార్స్
రాజానగరం: సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)కి సోమవారం వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలో నటీనటులు కాలేజీ విద్యార్థులతో కలసి కొంతసేపు సందడి చేశారు. హీరోయిన్లు ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతీ చిత్రంలోని పాటలను విడుదల చేస్తూ, ఆయా పాటలకు అనుగుణంగా విద్యార్థులతో కలసి స్టెప్స్ వేస్తూ, కేరింతలు కొట్టించారు. విద్యార్థులతో సెల్ఫీలు తీసుకున్నారు. తొలుత దర్శకుడు కిషోర్ తిరుమల ఆధ్వర్యంలో యూనివర్సిటీకి వచ్చిన చిత్ర బృందానికి జీజీయూ చాన్సలర్ కేవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) ఆహ్వానం పలికారు.
విద్యార్థులతో కలిసి చిందులేసిన స్టార్స్


