
సెప్టిక్ ట్యాంక్‌లో ఆవు నరకయాతన
బయటకు తీసి రక్షించిన స్థానికులు
అమలాపురం టౌన్: సెప్టిక్ ట్యాంక్‌లో పడిన ఆవు నరకయాతన అనుభవించింది. నీరు, తిండి లేక బాగా నీరసించిపోయి కుంగిపోయింది. చివరకు స్థానికులు ఆ ఆవును సెప్టిక్ ట్యాంక్ నుంచి బయటకు తీసి రక్షించారు. అమలాపురం పట్టణం 22వ వార్డు పరిఽధి భోగరాజు వీధిలో తుప్పల్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో ఆవు ప్రమాదవశాత్తూ పడిపోయింది. పచ్చిక మేత కోసం వెళ్లిన ఆవు ఆ ట్యాంక్‌లో పడి బయటకు రాలేక పోయింది. అమలాపురం సత్యసాయి సేవా సంస్థల డివిజన్ కో ఆర్డినేటర్, ఈఎన్‌టీ నిపుణులు డాక్టర్ జి.ప్రభాకర్ ఈ సమాచారాన్ని ఆ వార్డు కౌన్సిలర్ గొవ్వాల రాజేష్‌కు అందించారు. జేసీబీని రప్పించి ఆవును బయటకు తీయించారు. స్థానికుల సహాయంతో గంటకు పైగా శ్రమించి ఆవును బయటకు తీశారు. స్థానికులు గంగుమళ్ల శ్రీను, మేడిద రమేష్, రాజులపూడి భాస్కరరావు శ్రమించారు. బయటకు తీసిన ఆవు బాగా నీరసించిపోయి ఉండడంతో దానికి తాగునీరు, అరటి పండ్లు పెట్టి సేద తీర్చారు.

సెప్టిక్ ట్యాంక్‌లో ఆవు నరకయాతన