
మహిళా కబడ్డీ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ ప్రారంభం
పెదపూడి: జి.మామిడాడ డీఎల్ రెడ్డి డిగ్రీ కళాశాలలో ఆదివారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ మహిళల కబడ్డీ జట్టు టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్‌ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా జి.మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ, కరస్పాండెంట్ డి.ఆర్.కే.రెడ్డి హాజరయ్యారు. డీఆర్‌కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ సబ్బెళ్ల శివన్నారాయణరెడ్డి మాట్లాడుతూ రెండ్రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి యూనివర్సిటీ పరిధిలోని 11 కళాశాలలకు చెందిన 150 మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. వీరిలో 14 మందిని విశ్వవిద్యాలయం జట్టుగా ఎంపిక చేస్తారన్నారు. ఈ జట్టు ఈ నెల 29 నుంచి నవంబర్ రెండు వరకు తమిళనాడు రాష్ట్రం సేలంలో వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే జాతీయస్థాయి అంతర్ విశ్వవిద్యాలయాల మహిళా కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొంటుందన్నారు. ఎంపికై న జట్టుకు పది రోజులపాటు డీఎల్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తారన్నారు. అబ్జర్వర్లుగా డాక్టర్ జీ.ప్రమీలరాణి, సభ్యులుగా వై.సుధారాణి, ఎం.వీరబాబు వ్యవహరించారు. టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.లోవరాజు, జి.మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు ఎం.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.