
సత్యదీక్ష వస్త్రాలు, మాలల పంపిణీ
అన్నవరం: ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న సత్యదీక్షలకు ప్రచారంతో బాటు సత్యదీక్షలు చేపట్టే స్వాములకు దీక్షా వస్త్రాలు, మాలలు, దీక్షా నియమాల పుస్తకాల పంపిణీని ఆదివారం ప్రారంభించారు. శనివారం సాక్షి దినపత్రికలో ‘సత్యదీక్షకు ప్రచారమేదీ? శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆ వార్తకు స్పందించిన దేవస్థానం అధికారులుచైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు చేతులమీదుగా ఆదివారం దీక్షా వస్త్రాల పంపిణీ ప్రారంభించారు. త్వరలో అల్లూరి జిల్లా అడ్డతీగలలో కూడా ఈ దీక్షా వస్త్రాలు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. సత్యదీక్షలపై సత్యరథంతో ప్రచారం చేయిస్తున్నట్టు తెలిపారు.

సత్యదీక్ష వస్త్రాలు, మాలల పంపిణీ

సత్యదీక్ష వస్త్రాలు, మాలల పంపిణీ