
సివిల్ పెన్షనర్ల నూతన కార్యవర్గం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. కాకినాడలో శనివారం జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్‌గా పి.మహేశ్వరరావు, కన్వీనర్‌గా తురగా సూర్యారావు, జిల్లా ఫైనాన్స్ కార్యదర్శిగా డీఎల్‌ఎన్ శాస్త్రి, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పాత పెన్షనర్లకు వేతన సంఘం సిఫార్సులు అందించాలని డిమాండ్ చేశారు. వాలిడేషన్ చట్టం రద్దుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి త్వరలోనే రాజ్యసభ, ఎంపీలను కలిసి వినతి పత్రం ఇస్తామని తెలిపారు.