
కూటమి అరాచకాలకు మూల్యం తప్పదు
ఫ కార్యకర్తలకు వెన్నంటి నిలుస్తాంఫ అభాగ్యులకు అండగా ‘డిజిటల్ బుక్’
ఫ ధైర్యంగా క్యూఆర్ కోడ్, ఐవీఆర్‌ఎస్‌కు ఫిర్యాదు చేయండి
ఫ వచ్చేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేఫ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి పాలనలో అన్యాయానికి పాల్పడుతున్న ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్తకు పార్టీ తరఫున డిజిటల్ బుక్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కాకినాడ సిటీ కార్యాలయంలో డిజిటల్ బుక్‌ను రాజా శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ఏలుబడిలో అన్యాయానికి గురైన కార్యకర్తలు ధైర్యంగా క్యూఆర్ కోడ్, ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. దీనికోసమే జగన్ ఈ కొత్త వ్యవస్థ తీసుకువచ్చారన్నారు. తుని నియోజకవర్గం బెండపూడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త, కాపు సామాజికవర్గ నేత హత్యకు గురైతే పోలీసులు కేసు నమోదు చేయని దుస్థితి చూశామని గుర్తు చేశారు. అప్పట్లో కోర్టుకు వెళ్లి కేసు నమోదు చేయించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి కూటమి పాలనలో నెలకొందన్నారు. మూడున్నరేళ్లలో వచ్చేది కచ్చితంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వమనే విషయం ప్రజల్లో బలంగా వినిపిస్తోందన్నారు. చివరకు అసెంబ్లీలో కూటమి ప్రజాప్రతినిధులు సైతం కంగారు పడుతున్న విషయం స్పష్టమవుతోందని ఆయన చెప్పారు.
కూటమి దగా పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పైనా వైఎస్సార్ సీపీ పోరాడుతుందని రాజా స్పష్టం చేశారు. రైతులకు ఎరువుల సమస్య వస్తే వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎక్కడికక్కడ రోడ్డెక్కి, పోలీసు కేసులకు సైతం వెరవకుండా పోరాటం చేయబట్టే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఎరువులు దిగుమతి చేసుకుందని చెప్పారు. ప్రజల పక్షాన పోరాడేది వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. ప్రతి సమస్యపై స్పందిస్తున్న పార్టీగా రాష్ట్ర ప్రజలంతా వైఎస్సార్ సీపీని చూస్తున్నారన్నారు. టీడీపీ మాదిరిగా ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే తమ పార్టీ బయటకు రాలేదన్నారు. సూపర్ సిక్స్‌లో ఏ పథకాలు వచ్చాయనేది ప్రజలకు తెలియంది కాదని రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి తోట నరసింహం, పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్థినీడి సుజాత, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి జమీలు, కొప్పన శివనాథ్, ఒమ్మి రఘురామ్, పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శులు రాగిరెడ్డి దీప్తికుమార్, జమ్మలమడక నాగమణి, ప్రచార సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావూరి వెంకటేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి సుంకర సాగర్, బీసీ సెల్ అధ్యక్షుడు అల్లి రాజబాబు, కర్రి వీర్రెడ్డి (చినబాబు), పార్టీ నేతలు యనమల కృష్ణుడు, పసుపులేటి వెంకటలక్ష్మి, రోకళ్ల సత్య తదితరులు పాల్గొన్నారు.