
లలితాదేవిగా తలుపులమ్మ తల్లి
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారిని శరన్నవరాత్ర ఉత్సవాలను పురస్కరించుకుని ఆరో రోజైన శనివారం శ్రీ లలితాదేవిగా అలంకరించారు. అమ్మవారిని భవానీ భక్తులు దర్శించి, సామూహిక కుంకుమ పూజలు చేశారు. ఆదివారం మహాచండీదేవిగా అమ్మవారిని అలంకరించనున్నట్లు వేదపండితులు తెలిపారు.
వేలాదిగా.. శృంగార
వల్లభుని దర్శనానికి..
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామివారిని సుమారు 30 వేల మంది భక్తులు దర్శించుకు న్నారు. వివిధ సేవలు, కేశఖండన టికెట్లతో పాటు అన్నదాన విరాళాలు కలిపి స్వామివారికి రూ.4,77,983 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు.
పుష్కర ఘాట్‌లో
ఇద్దరి గల్లంతు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్):
గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు భవానీ భక్తులు గల్లంతైన సంఘటన స్థానిక పుష్కర ఘాట్‌లో చోటు చేసుకుంది. గోకవరం మండలం పెంటపల్లికి చెందిన గుబ్బల బాపిరాజు (28) వాచ్‌మెన్‌గా పని చేస్తూ రాజమహేంద్రవరంలో ప్రస్తుతం నివసిస్తున్నాడు. రాజానగరం మండలం శ్రీరాంపురానికి చెందిన అతడి బావమరిది రాయుడు వీరబాబు (25) హైదరాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. భవానీమాల వేసుకోవడానికి అతడు ఇటీవల ఇంటికి వచ్చాడు. బాపిరాజు, వీరబాబు కుటుంబ సభ్యులతో కలసి శనివారం సాయంత్రం రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌కు వచ్చారు. అక్కడ బాపిరాజు, వీరబాబు స్నానానికి దిగారు. నది లోతు ఎంత ఉందో తెలియక ఊబిలో దిగి ఇద్దరూ గల్లంతయ్యారు. వారి కోసం త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ అప్పారావు ఆధ్వర్యాన ఎస్సైలు, సిబ్బంది స్థానిక మత్స్యకారులతో గాలింపు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గల్లంతైన బాపిరాజు, వీరబాబు (పాత చిత్రాలు)

లలితాదేవిగా తలుపులమ్మ తల్లి

లలితాదేవిగా తలుపులమ్మ తల్లి

లలితాదేవిగా తలుపులమ్మ తల్లి