
రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు 86 మంది హాజరు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విద్యార్థులకు డాక్టర్ రెడ్డీస్ బుధవారం నిర్వహించిన రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కి 86 మంది విద్యార్థులు హాజరు కాగా రాత పరీక్ష నిర్వహించిన 54 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఇంటర్‌ూయ్వలు నిర్వహించిన అనంతరం వీరిలో సంస్థకు అవసరమైన వారిని ఎంపిక చేసి, ఉద్యోగాలు ఇస్తామని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. 2024–25లో బీఎస్సీ, ఎంఎస్సీలో కెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ పూర్తి చేసి, పదో తరగతి నుంచి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కి హాజరయ్యారన్నారు. ఉద్యోగాలకు ఎంపికై తే బీఎస్సీ వారికి రూ.2.10 లక్షలు, ఎంఎస్సీ వారికి రూ.2.60 లక్షలు వార్షిక వేతనంగా చెల్లిస్తారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.