
శరన్నవరాత్ర ఉత్సవాలకు రాట పూజలు
రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో 54వ శరన్నవరాత్ర ఉత్సవాలకు రాట ముహూర్తపు పూజలు బుధవారం నిర్వహించారు. ఏటా పీఠంలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న శరన్నవరాత్రులకు వేద పండితులు చీమలకొండ వీరావధాని ఆధ్వర్యంలో పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) కుమార్తె గాదె సత్యవెంకటకామేశ్వరి, భాస్కరనారాయణ దంపతులు పూజలకు శ్రీకారం చుట్టారు. ఉదయం 9.46 గంటలకు వినాయకపూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం తదితర పూజలు చేశారు. అనంతరం పందిరి రాట వేసి ఉత్సవ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, విజయదుర్గా కళాశాల కరస్పాండెంట్ పెద్దపాటి సత్యకనకదుర్గ, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.