
ఇన్‌స్పైర్ అయ్యేనా..!
● ఇన్‌స్పైర్ మనాక్ దరఖాస్తులకు
ఈ నెల 15 వరకు గడువు
● 2025–26 జిల్లా నామినేషన్ల లక్ష్యం 1,780
● ఇప్పటి వరకు నమోదైనవి కేవలం 140 మాత్రమే..
రాయవరం: విద్యార్థుల్లో శాసీ్త్రయ సాంకేతికతను పెంపొందించి.. భావి శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు లభించే అరుదైన అవకాశం ఇన్‌స్పైర్ మనాక్. దీనిపై ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్ల సైన్స్ టీచర్లు ఆసక్తి చూపడం లేదు. ఇన్‌స్పైర్ మనాక్ కింద కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న శాసీ్త్రయ ప్రయోగ పోటీలకు ఆశించిన మేర స్పందన కరవైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని 334 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను కలిపి ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టుల చొప్పున 1,780 ప్రాజెక్టులను యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 48 పాఠశాలలకు సంబంధించి 140 ప్రాజెక్టులు మాత్రమే నమోదయ్యాయి. అన్ని యాజమాన్యాల పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఇందులో భాగస్వాములు కావాల్సి ఉంది. ఆ దిశగా వారు అంతగా చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్‌స్పైర్ మనాక్ నామినేషన్లు నమోదు చేసుకునేందుకు సంబంధించిన గడువు ఈ నెల 15వ తేదీతో ముగుస్తుంది. ఇన్‌స్పైర్ మనాక్ ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే మినహా లక్ష్యం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
సెప్టెంబర్ 2వ తేదీ నాటికి ఇన్‌స్పైర్
మనాక్ వివరాలు
జిల్లా మొత్తం నమోదు నమోదు
స్కూళ్లు అయినవి కానివి
కాకినాడ 331 40 291
తూర్పుగోదావరి 352 34 318
కోనసీమ 334 48 286