
ఉత్సాహంగా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 15వ జాతీయ జూనియర్ మహిళల హాకీ పోటీలు మంగళవారం డీఎస్‌ఏ మైదానంలో ఉత్సాహంగా జరిగాయి. పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 11–0 స్కోర్‌తో ఉత్తరాఖండ్, ఢిల్లీ, తమిళనాడు మధ్య జరిగిన మ్యాచ్ 3–3 స్కోర్‌తో డ్రా కాగా, ఛండీఘర్, మధ్యప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 5–0 స్కోర్‌తో మధ్యప్రదేశ్ విజయం సాఽధించాయి. హర్యానా, బెంగాల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్యానా 7–1 స్కోర్‌తోను, కర్ణాటక, జార్ఘండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జార్ఘండ్ 2–0 స్కోర్‌తోను, ఆంఽధ్రప్రదేశ్, ఒడిశా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒడిశా 3–1 స్కోర్‌తో గెలుపొందాయి. మంగళవారం నిర్వహించిన మ్యాచ్‌లను రాష్ట్ర హాకీ సంఘ సంయుక్త కార్యదర్శి వి.రవిరాజు పర్యవేక్షించారు.