
ఆయకట్టుకు నేడు పంపా నీరు
● తొలుత 40 క్యూసెక్కుల విడుదల
● 93.5 అడుగులకు చేరిన నీటిమట్టం
● అవసరాన్ని బట్టి మరిన్ని జలాలు
● ఈఈ శేషగిరిరావు
అన్నవరం: పంపా రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు శనివారం సాగునీరు విడుదల చేస్తున్నట్లు పెద్దాపురం డివిజన్ ఇరిగేషన్ ఈఈ జి.శేషగిరి రావు శుక్రవారం తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు రైతు నాయకులు నదికి పూజలు చేసి సారె సమర్పించిన అనంతరం నీటిని విడుదల చే యనున్నట్టు ఈఈ తెలిపారు. ప్రస్తుతం 20 క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని రైతుల అ వసరాల మేరకు మరింత వదులుతామని ఆయన తెలిపారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున ఈ ఏడాది పూర్తి స్థాయిలో పంపా ఆయకట్టులో 12,500 ఎకరాలకు సాగునీరు అందిస్తా మని తెలిపారు. చివరి ఆయకట్టుకు కూడా నీరు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నీటిమట్టం 93.5 అడుగులు
పంపా రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 103 అడు గులు కాగా, శుక్రవారం సాయంత్రానికి 93.5 అ డుగులకు చేరుకుంది. గరిష్ట నిల్వ 0.43 టీఎంసీ లు కాగా ప్రస్తుతం 150 ఎంసీఎఫ్‌టీ నిల్వ ఉంది. రెండ్రోజులుగా పంపా క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు కురుస్తున్నందున రిజర్వాయర్ లోకి 105 క్యూసెక్కుల నీరు వస్తోందని, నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని ఈఈ తెలిపారు.
ఎస్‌జీటీ, స్కూలు
అసిస్టెంట్‌లకు పరీక్ష రేపు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కొంతమూరులోని ఈస్టర్ ఎక్స్‌న్ రెసిడెన్షియల్ ఎయిడెడ్ ఎలిమెంటరీ, హైస్కూల్‌లో ఖాళీగా ఉన్న ఎస్‌జీటీ, స్కూలు అసిస్టెంట్ పోస్టులకు ఆదివారం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు ఈ పరీక్షకు హాజరుకావాలన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. కాకినాడలోని అయాన్ డిజిటల్ జోన్, అచ్యుతాపురంలో 486 మందికి మొదటి సెషన్‌లో స్కూలు అసిస్టెంట్, 500 మందికి రెండో సెషన్‌లో ఎస్‌జీటీ వారికి పరీక్షలు జరుగుతాయన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, లూథర్‌గిరిలోని అయాన్ డిజిటల్ జోన్‌లో 263 మందికి రెండో సెషన్‌లో ఎస్‌జీటీలకు పరీక్షలు జరుగుతాయన్నారు.
ఈవీఎం, వీవీ ప్యాట్‌లకు పటిష్ట భద్రత
బోట్‌క్లబ్: ఈవీఎం, వీప్యాట్ (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు)లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాములను శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సీఈఓ, రాష్ట్ర ఈవీఎంల నోడల్ అధికారి పి .తాతబ్బాయి, రెవెన్యూ, ఎన్నికలు, పోలీస్‌శాఖల అధికారులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.