
వెయ్యి మందికి విజయవంతంగా ఐవీఎఫ్
కాకినాడ క్రైం: కాకినాడ మెడ్‌వే సంజీవి ఐవీఎఫ్ సెంటర్‌లో వెయ్యి మందికి మహిళలకు ఐవీఎఫ్‌లు నిర్వహించి, తల్లి కావాలన్న వారి కలను సాకారం చేశామని ఐవీఎఫ్ నిపుణురాలు, గైనకాలజిస్టు డాక్టర్ ఎన్.కిన్నెర వీణ అన్నారు. ఆ సెంటర్‌లో శుక్రవారం వరల్డ్ ఐవీఎఫ్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో డాక్టర్ కిన్నెర మాట్లాడుతూ సమగ్ర సంరక్షణ ద్వారా తల్లిదండ్రుల కల నెరవేర్చడమే తమ లక్ష్యమన్నారు. సెంటర్ హెడ్ దినేష్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఐవీఎఫ్ చికిత్స అందిస్తున్నామన్నారు. మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రసాద్ మాట్లాడుతూ ఐవీఎఫ్ కేవలం ఓ వైద్య ప్రక్రియ కాదని, వైవాహిక జీవితాన్ని సంపూర్ణం చేసే ఓ అద్భుతమన్నారు. డాక్టర్ సందీప్ మాట్లాడుతూ ప్రతి ఐవీఎఫ్ కేసుపై వ్యక్తిగత పర్యవేక్షణ కొనసాగిస్తూ తల్లిదండ్రుల కలలు సాకారం చేస్తున్నామని తెలిపారు. కాగా.. ఐవీఎఫ్ ద్వారా విజయవంతంగా పిల్లల్ని పొందిన తల్లిదండ్రులు తమ అనుభవాల్ని పంచుకున్నారు.