
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు
రాజమహేంద్రవరం సిటీ: ఏపీఎస్ ఆర్టీసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తూ వివిధ సహజ మరణాలతో పాటు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పత్రాలను అందజేసినట్లు డీపీటీఓ వైఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. రాజమహేంద్రవరంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పది మందిని కండక్టర్ గ్రేడ్–2 ఉద్యోగం కోసం ఎంపిక చేసి, నియామక పత్రాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు, కోనసీమ జిల్లా ప్రజా రవాణా అధికారి రాఘవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.