
ఎస్‌బీఐ ఏటీఎం దగ్ధం
● పక్కనే ఉన్న బైక్‌లు, కారు సైతం
అగ్నికి ఆహుతి
● విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం
యానాం: పట్టణంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం కాలిపోయిన ఘటనలో సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. కొత్త బస్టాండ్ సమీపంలోని పోలీస్ కార్వర్ట్స్ వెనుక ఉన్న కంచర్ల కాంప్లెక్స్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున మంటలు వ్యాపించాయి. అవి ఆ పక్కనే ఉన్న మల్లిపూడి శ్రీనివాసరావుకు చెందిన మోటార్ మెకానిక్ షాపునకు విస్తరించాయి. దీంతో అక్కడే రిపేర్‌కు వచ్చిన నాలుగు బైక్‌లు, ఒక కారు కాలిపోయాయి. పోలీస్ క్వార్టర్ ఆవరణలో ఇంటి వాకిలి తుడుస్తున్న ఓ మహిళ ఆ మంటలను చూసి అగ్నిమాపక దళ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్ జగడం మీరా సాహెబ్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాద స్థలాన్ని సీఐ అడలరసన్, ఎస్‌హెచ్‌ఒ–2 కట్టా సుబ్బరాజు, ఏఎస్సై పంపన మూర్తి, ఎస్‌బీఐ అధికార్లు పరిశీలించారు. ఏటీఎంలో నగదు ఎంత ఉందనేది ఇంకా తెలియలేదు. మెకానిక్ షాపు యజమాని మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో సుమారు రూ.15 లక్షల విలువైన బైక్‌లు, కారు కాలిపోయాయన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

ఎస్‌బీఐ ఏటీఎం దగ్ధం

ఎస్‌బీఐ ఏటీఎం దగ్ధం