వినిపించని ఆకలి కేకలు | - | Sakshi
Sakshi News home page

వినిపించని ఆకలి కేకలు

Mar 10 2025 12:05 AM | Updated on Mar 10 2025 12:05 AM

వినిపించని ఆకలి కేకలు

వినిపించని ఆకలి కేకలు

కాకినాడ క్రైం: మహిళా దినోత్సవం ముగిసింది, జిల్లాలో ఈ సంబరాలు అంబరాన్ని తాకాయి. వారోత్సవాలతో వారం రోజులూ పండగ వాతావరణం నెలకొంది. ర్యాలీలు, మారథాన్లు, ఆటలు, పాటలు, ఉపన్యాసాలు, మానవహారాలు ఒకటా, రెండా.. విమెన్స్‌ డే వేడుకలతో జిల్లా దద్దరిల్లింది. ఇది నాణానికి ఓ వైపు మాత్రమే. మరోవైపు సదరు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులు ఎవరికీ జీతాలు లేవు. ఊకదంపుడు ఉపన్యాసాల్లో మాటలన్నీ ముఖస్తుతికేనన్న విషయం తేలిపోయింది. గతేడాది ఆగస్టు నుంచి గొడ్డు చాకిరీ చేస్తున్నా జీతాలకు మాత్రం వారు నోచుకోలేదు.

కష్టపడి పని చేసినా వారికి జీతం ఇవ్వడం లేదు. ఈ దుస్థితి ఇంకేదో డిపార్టుమెంట్‌లో కాదు. మహిళా భద్రత, భవిత, భరోసా కోసం నిర్దేశించిన సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులదే. పేరుకు తగ్గట్టుగానే జిల్లాలో ఈ శాఖలో మహిళా ఉద్యోగులే ఎక్కువ. ఈ డిపార్టుమెంట్‌లో ఉన్న మూడు కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సుమారు 800 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు నెలల తరబడి జీతాల్లేకపోవడంతో, అప్పులపాలై వారి కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి నెలకొంది. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ సిబ్బంది ఆకలి కేకలు వారిలో ఏ ఒక్కరికీ వినిపించ లేదు. విమెన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలెప్‌మెంట్‌ డిపార్టుమెంట్‌లో ఉన్న రెగ్యులర్‌ ఉద్యోగులకు జీతాలు అందుతుండగా, వారంతా అధికార హోదాలో కొనసాగుతున్నారు. క్షేత్ర స్థాయిలో వారు నిర్దేశించే ప్రతి పని పూర్తి చేయాల్సిన కష్టం.. చిరుద్యోగులైన కాంట్రాక్టు సిబ్బందిదే. ఈ డిపార్టుమెంట్‌ పరిధిలో సేవలందిస్తున్న ఐసీడీఎస్‌కు చెందిన అంగన్‌వాడీలకు ఈ నెలలో నేటికీ జీతాలే పడలేదు. వీరంతా మహిళలే, కనీసం 600 మంది ఉంటారు. అంగన్‌వాడీ కేంద్రాల అద్దెలను కూడా వీరు తమ జీతాల నుంచే చెల్లిస్తారు. ఈ అద్దెలు విడుదల చేసి ఆరు నెలలకు పైగా అయింది. సీమంతాల కోసం ప్రతి అంగన్‌వాడీ కార్యకర్త చేతిలో సొంత డబ్బు వెచ్చిస్తారు. నెలవారీ రూ.500 చొప్పున ఖర్చు చేస్తారు. ఇవి తిరిగి చెల్లించి ఏడాది కావస్తోంది.

తప్పని నరకయాతన

మహిళా దినోత్సవాల పేరుతో అంగన్‌వాడీలు ప్రత్యక్ష నరకం చూశారు. అధికారులు వీరితో ఓ ఆటాడుకున్నారు. జీతాలు నేటికీ రాకపోయినా చాకిరీ చేయించారు. ఠంచనుగా జీతాలు తీసుకుంటున్న రెగ్యులర్‌ హోదాలో కొనసాగుతున్న ఉద్యోగులకు విధి నిర్వహణలో ఇంతటి కష్టం లేదు. అఽధికార హోదాలో వారు తీవ్రమైన పని ఒత్తిడిని అంగన్‌వాడీలపై పెడుతున్నారు. వారోత్సవాలంటూ రేయింబవళ్లు తేడా లేకుండా పోయింది. ర్యాలీలు, మారథాన్లకు ఉదయాన్నే వచ్చి వాలిపోవాలన్నారు. రానివారికి మెమోలు ఇస్తామని బెదిరించారు. వచ్చి పడిగాపులు కాస్తే అఽధికారులు ఎప్పటికో తీరికగా కార్లు దిగేవారు. పోషకాహార గొప్పతనాన్ని చెబుతూ, ప్రతి అంగన్‌వాడీ సిబ్బంది రెండు, మూడు రకాల చిరుధాన్యాల వంటలు వండి తేవాలన్నారు. ఆకలి పస్తులున్నా, ఆటల్లో పాల్గొనక తప్పదని ఒత్తిడి తెచ్చారు. వీటన్నింటినీ మించి ఇల్లూ వాకిలి వదిలి, పిల్లలు, భర్తను విడిచి ఉదయాన్నే వాలిపోవాలంటూ హుకుం జారీ చేశారు.

ఉన్నతాధికార్లకు నివేదించాం

సిబ్బందికి జీతాలు చెల్లించలేదనేది వాస్తవమే. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. ఫైల్‌ కూడా పంపించాం. త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం.

– కె.విజయకుమారి,

పీడీ, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ,

కాకినాడ

మహిళా దినోత్సవం నాటికీ అందని

వేతనాలు

ఉసూరుమంటున్న మహిళా సిబ్బంది

సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో దయనీయ స్థితి

వారోత్సవాల పేరుతో అంగన్‌వాడీలకు ప్రత్యక్ష నరకం

మూడు నెలలు దాటినా..

అలాగే ఐసీపీఎస్‌, శిశు గృహ పరిఽధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చేతికంది మూడు నెలలు దాటింది. ఇదే పరిధిలో ఉన్న దిశ వన్‌స్టాప్‌ సెంటర్‌ ఉద్యోగులకు గతేడాది ఆగస్టు తర్వాత జీతాలే లేవు. వీరంతా ఆకలి పస్తులుంటూ, అప్పులు చేసుకుంటూ, వారి జీవితాలను నెట్టుకొస్తున్నారు. కష్టాన్నంతా పంటికింద బిగువపట్టి ఉద్యోగాలు చేస్తున్నారు. కనీసం తమ ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్‌కై నా చేతిలో చిల్లిగవ్వ ఉండడం లేదంటూ తమ ఆవేదనను వెళ్లబోసుకుంటున్నారు. జీతాలు ఇవ్వకున్నా ఫీల్డ్‌ వర్క్‌ తప్పడం లేదని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement